వర్షం భారీ దెబ్బ కొట్టిందే.. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సడన్ బ్రేక్.. ఎంత లాస్ అంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ స్టేడియం లో నిన్న రాత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్‌కు భారీ వర్షాలు కారణంగా స‌డ‌న్ బ్రేక్ పడింది. దే కాల్ హిమ్ ఓజీ కాన్సర్ట్‌ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులను తెచ్చుకున్న టీం.. వేల మంది అభిమానుల మధ్య గ్రాండ్ లెవెల్ లో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు. ఆయన స్పీచ్ అభిమానులకు ఓసారి కొత్త ఫీల్‌ను కల్పించింది. కానీ.. వర్షం మాత్రం ఆడియన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈవెంట్ అర్ధంతరంగా ఆపేయడం వల్ల పెట్టిన ఖ‌ర్చంతా కూడా పోయింది.

Pawan Kalyan roars at OG pre-release: 'I forgot I am a Deputy CM'

ఫైనాన్షియల్ గా మేకర్స్‌కు లక్షల్లో లాస్ మిగిలిన పరిస్థితి. పవర్ స్టార్ స్పీచ్ ను నడి వర్షంలోనే ఆయన ఫ్యాన్స్ వింటూ ఉండిపోయారు. ఇక వర్షం ఎంతకి తగ్గకపోవడంతో.. మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. ఇక ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయాల్సిందేనని అడగగా.. ట్రైలర్ వర్క్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదని డైరెక్ట‌ర్‌చెప్పడం ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది. అభిమానుల కోరిక మేరకు.. ట్రైలర్ అయిన వరకు వేసేయాల్సిందేనని పవన్ పట్టు పట్టాడు. దీంతో ట్రైలర్ ప్లే చేసి ఈవెంట్‌ ముగించారు. ఎల్బీ స్టేడియం లో జరిగిన ఈ ఈవెంట్ లో సందడి చేసిన వాళ్లకు మాత్రమే ట్రైలర్‌ను వీక్షించే ఛాన్స్ దక్కింది.

OG' Pre-release Event, Pawan Kalyan's Grand Entry, Emraan Hashmi Wows Fans, When Will Trailer Drop?

అయితే.. అఫీషియల్‌గా ట్రైలర్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని దానిపై మాత్రం మేకర్స్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే.. ఈవెంట్‌కు వెళ్లలేకపోయినా అభిమానులు.. తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు. వాస్తవానికి ట్రైలర్ నిన్న ఆదివారం ఉదయం 10:08కి రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ.. ట్రైలర్‌ను రిలీజ్ చేయకుండా ఈవెంట్లో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. కానీ.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అద్దాంతరంగా ఆపడం ట్రైలర్ ఫ్రీ వర్క్ పూర్తి కాలేదని రిలీజ్ చేయకుండా ఆపడం.. ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించింది. కాగా.. ఈరోజు(సోమ‌వారం) ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. అంతవరకు నిన్న ఈవెంట్ లో రిలీజ్ అయిన ట్రైలర్ వీడియోను ఎంజాయ్ చేసేయండి.