ప్రభాస్ మూవీ చూసి ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసిన ఆ దేశపు కాబోయే ప్రధాని.. మేటర్ ఇదే..?

ఇండియన్‌ ఫ్రెండ్లీ కంట్రీ.. నొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం అల్లర్లతో అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. అవినీతితో పాటు.. సోషల్ మీడియా పై నిషేధాలతో మొదలైన ప్రజల కోపానికి.. ప్రధానితో పాటు, ప్రభుత్వం అంతా దాసోహం అయ్యారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం ఈ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖాట్మండు మేయర్ గా ఉన్న బాలేంద్రకు అక్క‌డి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే చాలామంది జనం సైతం బాలేంద్ర షా ని ప్రధాని అవ్వాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలేంద్ర షా ప్రధాని అనే టాపిక్ రావడంతో.. అతనికి భారత్ తో ఉన్న వైరం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Prime Video: Adipurush

గతంలో అంటే దాదాపు రెండేళ్ల‌ క్రితం.. భారత సినిమాలపై బాలెంద్ర చూపించిన అనవసరమైన ఆగ్రహం హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల క్రితం ఖ‌ట్మాండ్ మేయర్ హోదాలో ఉన్న తాను.. ఆ నగరంలో ఇండియన్ సినిమాల ప్రదర్శనను బ్యాన్ చేయించాడు. దాంతో ఖ‌ట్మండు మెట్రోపాలిస్ తో పాటు.. ఫోక‌ర్ మెట్రోపాలిటన్ నగరం కూడా ఇండియన్ సినీ ప్రదర్శనలను బ్యాన్ చేసింది. ఈ విషయంలో కూడా ఫోక‌ర్ మెట్రోపాలిటన్ మేయ‌ర్ ధ‌న‌రాజ్ ఆచార్య కూడా.. బాలేంద్ర షాను అనుసరించి ఇండియన్‌ సినిమాలను అప్పటికప్పుడు నిలిపేసి.. వెంటనే వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలి సినిమాలను రిలీజ్ చేశారు. ఇంతకీ ఇలా బాలీవుడ్ సినిమాలపై నేపాల్ మేయర్స్ వరుసగా ఆగ్రహాన్ని చూపించడానికి కారణం మరెవరో కాదు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమానే దీనికి కారణం. బాలేంద్ర షా.. సోషల్ మీడియా వేదికగా దీన్ని వెల్లడించాడు.

Adipurush' remains steady at box-office, Prabhas film earns Rs 5 cr on day  9 - The Economic Times

భారతీయ సినిమా ఆది పురుష్ చూశా. ఆ సినిమాల్లో రాముని సతీమణి జానకి జన్మస్థలంపై తప్పుడు ప్రచారం సాగింది.. అందులో ఆమెను భారత బిడ్డ అని చెప్పే సంభాషణ ఉంది. ఇది సరికాదని.. అభ్యంతరమైనదని.. మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వాళ్ళ తప్పును వాళ్లు సరిదిద్దుకోవడానికి మూడు రోజుల సమయం కూడా ఇచ్చాం. అయినా సరే.. వాళ్ళు సరిదిద్దుకోలేదు. నిజానికి సీతమ్మ మా నెపోలియన్ల నేలపై జన్మించారు.. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవానికి చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం మా అందరి హక్కు. ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ నేపాలి పౌరుడి ప్రథమ కర్తవ్యం.. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ బాలేంద్ర షా రాసుకొచ్చాడు. ఖాట్మండు మేయర్ గా ఉన్న ఆయన అప్పట్లో షేర్ చేసుకున్న ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అయితే.. ఆ తర్వాత నేపాలి కాపిటల్ లో సినిమా నిషేధించిన క్రమంలో ఆది పురుష్‌ నిర్మాణ సంస్థ అయిన టి – సిరీస్.. నేపాలి మేయర్కు లేఖ రాశి తగిన చర్యలు తీసుకోవాలంటు కోరడంతో.. సినిమాపై నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయ స్థానాలు వెల్లడించాయి. దీంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది.