టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా మిరాయ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ దక్కించుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు కళ్లగొట్టి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే మూవీ టీం ఫుల్ జోష్లా ఉన్నారు. ఇప్పటికే సక్సెస్ మెషిన్ కంప్లీట్ చేసిన టీం.. తాజాగా ఇంటర్వ్యూలను పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. తమ సంస్థలో వచ్చిన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
తమ సంస్థ నుంచి వచ్చిన గత ఆరు సినిమాల వల్ల తనకు ఏకంగా రూ.140 కోట్ల నష్టాలు వచ్చాయని.. ఇప్పటికే అవి రికవరీ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. 2021 నుంచి 23 మధ్యకాలంలో నాన్ థియేట్రికల్ హక్కులు ఫుల్ డిమాండ్ నెలకొందని. కానీ.. 2024 నుంచి అది మొత్తం చేంజ్ అయిపోయిందని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి డిమాండ్ చాలా వరకు తగ్గిపోయిందని.. దీంతో సినిమాలను థియేటర్ హక్కులను అమ్మడం ఇబ్బందిగా మారింది అంటూ వివరించాడు. ఆ కారణంగానే గత ఆరు సినిమాలకు ఏకంగా రూ.140 కోట్ల వరకు నష్టం జరిగిందని.. వాటిలో మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం, పట్టిరామస్వామి లాంటి సినిమాలు ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఆరు సినిమాలు థియేట్రికల్ నరంగా మంచి సక్సెస్ సాధించినా.. ఓటీటీ హక్కుల డిమాండ్ తగ్గడంతో భారీ నష్టం చూసానని.. అవి ఇప్పటికీ రికవరీ కాలేదంటూ వివరించాడు. ఇక ఓటీటీ సంస్థల క్యాలెండర్ ప్రకారం సినిమాలు రిలీజ్ చేసేయడం వల్ల కూడా నష్టాలు వచ్చాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా భవిష్యత్తులో ఉంటే చాలా కష్టతరమవుతుందని.. ఓటీటీ మార్కెట్ పరిస్థితులను బట్టి మాత్రమే ప్రొడ్యూసర్లు తమ సినిమాల కన్స్ట్రక్షన్ రిలీజ్లను ప్లాన్ చేసుకోవాలని.. నిర్మాతలు ఈ విషయాని అర్థం చేసుకోవాలని టీజీ విశ్వప్రసాద్ వివరించాడు. ఇక మిరాయ్ ఎలాంటి బ్లాక్ బాస్టర్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాలుగు భారీ సినిమాలు రానున్నాయి. వాటిల్లో జాంబిరెడ్డి 2, రాణమండల, కాలచక్ర, పినాక సినిమాలు ఉన్నాయి.