చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ లో తారక్.. ఫ్యాన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరైనా సరే.. ఓ సినిమా నటించే సినిమాతో బ్లాక్ బస్టర్ కొడితే.. దానికి సీక్వెన్స్ వస్తే బాగుంటుందని అభిమానులంతా ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది స్టార్ హీరోల అభిమానులు. అంతేకాదు.. మళ్లీ మా హీరో అలాంటి పాత్రలోనే నటిస్తే చూడాలని తాహ‌తహ‌లాడుతూ ఉంటారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ఆ హీరోలతోనే పంచుకుంటారు. అందుకే చాలామంది స్టార్ హీరోలు ఇటీవల కాలంలో సీక్వెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. తమ బ్లాక్ బస్టర్ సినిమాలకు కొనసాగింపుగా మరో సినిమాను చేయడం లేదా.. సీక్వెల్స్ ఫాలో అవ్వడం కామన్ అయిపోయింది. ఇలాంటి క్రమంలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుందంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇప్పుడు స్టార్ హీరోలు తమకు నచ్చిన సినిమాలను రీమేక్‌ చేస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ఇతర సినిమాల నుంచి ప్రేరణ పొందిన పాత్రలో సైతం స్టార్ హీరోలు నటిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి సిద్ధమవుతున్నాడంటూ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా సైతం రికార్డులు బ్రేక్ చేసి సంచలనాలు సృష్టించింది. ఆస్కార్ బ‌రిలోనూ సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో జరిగిన ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. చ‌ర‌ణ్ నటించిన ఏ సినిమాకు మీరు రీమేక్ చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పుకొచ్చాడు.

తారక్‌ మాట్లాడుతూ మగధీర సినిమా రీమేక్ చేయాలనిపిస్తుంది.. నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం.. అది చాలా విభిన్నమైన కాన్సెప్ట్. ఇక సినిమాలో చరణ్ యాక్టింగ్ ఆయన స్టైల్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటి పాత్రలో నటించాలనే కోరిక కలిగిందంటూ వివరించాడు. అంతేకాదు.. ఒకవేళ మగధీర కి సిక్వెన్స్‌ వస్తే కచ్చితంగా ఆ సినిమాలో నేను నటించేస్తా అంటూ సరదా కామెంట్ చేశాడు. తారక్ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని కల్పించాయి. ఇక ఫ్యాన్స్ ఇప్ప‌టికి మగధీర 2 లో తారక్ నటిస్తే బాగుంటుందని వీళ్లిద్దరు కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.