ఓజీ స్పెషల్ సాంగ్ కోసం బోల్ట్ బ్యూటీ ని రంగంలోకి దింపిన సుజిత్.. బ్లాక్ బస్టర్ పక్కా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్ పాత్రలో మెరవనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే.. సినిమా పై ఆసక్తిని అంతకంతకు పెంచేందుకు మేకర్స్‌ ఏదో ఒక సర్ప్రైజ్లు ఇస్తూ.. ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నారు.

ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్.. అలాగే స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ని రంగంలోకి దింపాడట సుజిత్. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదుగానీ.. ఇది నిజమైతే మాత్రం కుర్రాళ్లకు పూన‌కాలే అనడంలో సందేహం లేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. తనే నేహా శెట్టి. డీజే టిల్లులో బోల్డ్ సన్నివేశాల్లోనూ, రొమాంటిక్ సీన్స్ లోనూ తనదైన నటనతో కుర్రకారును కవ్వించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పవన్ స‌ర‌సన స్పెష‌ల్ సాంగ్‌లో ఆడి పాడడమే కాదు.. కొన్ని కీలక సన్నివేశాలలోను మేరవనుందట.

Neha Shetty to star in Pawan Kalyan's 'They Call Him OG': Here is what we  know | - Times of India

ఆమె చేసిన ఈ సాంగ్‌తో పాటే.. సినిమా ట్రైలర్‌ను ఈ వారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. సినిమా కోసం పవన్ తన రోల్ కు డబ్బింగ్ కూడా ప్రారంభించినట్లు ఇప్పటికే మేకర్స్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైన‌ర్ దసరా కానుకగా రిలీజై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక నేహా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసిందట‌. దాన్ని నవంబర్‌లో అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు వివరించింది.