బిగ్ బాస్ 9 నుంచి శ్రేష్టి వర్మ అవుట్.. వారంలో ఎంత సంపాదించిందంటే..?

తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వారం రోజులు గడిచిపోవడం.. ఫస్ట్ డే ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇమ్మ‌న్యేయేల్‌, శ్రేష్టి వర్మ, సంజన గల్రాని, డిమోన్‌ పవన్, సుమ‌న్‌ శెట్టి, రాము రాథోడ్, త‌నూజా,ఫ్లోరా షైని, రీతీ చౌద‌రి నామినేట్ కాగా.. శ్రేష్టి వర్మ మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తుంది. నిన్ననే ఈ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన షూట్ కూడా పూర్తి చేశారు. నేడు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ చూపించ‌నున్నారు. ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పాలి. శ్రేష్టి వర్మ గ్లామరే కాదు.. మంచి టాలెంట్ కూడా ఉన్న అమ్మాయి. మొదటి వారంలోనే ఈ అమ్మడు బయటికి రావడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది.

Her Cuteneaa.. Her Honesty.. Her Innocence is yet to be #explored Stay  tuned to witness our Shrasti's real side. #shrasti #shrastiverma  #biggboss9telugu #explorw

రెండో వారం లేదా మూడో వారంలో అమ్మడి టాలెంట్ బయటకు వస్తుందని కచ్చితంగా ఆమె సత్తా అందరికి తెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ.. ఆమె బ్యాడ్ లక్ ఏంటో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఈమెకు, ఫ్లోరా షైనీకి అతి తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తుంది. కానీ.. కాస్త ఎక్కువ మార్జిన్ వల్ల ఫ్లోరా షైనీ సేఫ్ అయిపోయింది. వాస్తవానికి హౌస్‌నుంచి ఎలిమినేట్ అయ్యే లక్షణాలన్నీ ఫ్లోరో షైనీకే ఉన్నాయ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈమె ఇప్పటివరకు బిగ్ బాస్ కి ఇచ్చిన కంటెంట్ అంటే ఏమీ లేదు. పైగా భవిష్యత్తులో టాస్కులైన బలంగా ఆడుతుందా అంటే డౌటే. ఒకవేళ ఆమెకు తక్కువ మార్జిన్ లో ఎక్కువ ఓటింగ్ వచ్చినా.. ఆమె వల్ల కంటెంట్ అసలు ఉండదు. ఈ క్రమంలోనే.. ఫ్లోరోషైనీని ఎలిమినేట్ చేసి శ్రేష్టి వర్మనే హౌస్ లో ఉంచాల్సిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Shrasti Verma Archives - Great Andhra

ఇక ఫ్లోరా షైనీకి సంజనతో గొడవ కారణంగా కాస్త కంటెంట్ వచ్చినా.. శ్రేష్టి వర్మ ఎలాంటి కాంట్రవర్సీలు లేకపోవడంతో.. కంటెంట్ అందించలేకపోయింది. అయితే.. ఇమ్ముతో కలిసి వారం రోజుల పాటు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచడంలో సక్సెస్ అయింది. తన టాలెంట్ బయటపడేలోపే శ్రేష్టికి బిగ్ షాక్ తగిలింది. ఇక జానీ మాస్టర్ కాంట్రవర్సీ కారణంగా నామినేషన్‌లో ఈమెకు ఓటింగ్ బాగా వీక్ అయిందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈమెకు చాలామంది ఓట్లు వేయడానికి ఇష్టపడలేదని.. అయితే ఇప్పుడు టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ లో ఒక్కరుగా సృష్టి వర్మ‌ ఉన్న కారణంగా బిగ్‌బాస్ మాత్రం.. వారానికి రెమ్యున‌రేషన్ గ్రాండ్ గానే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈమె ఒక్క వారంలో రూ.1,50,000 వరకు రెమ్యునరేషను సొంతం చేసుకుందట. కనీసం రెండు మూడు వారాలు ఉండి ఉంటే ఇంకా బాగుండేదంటూ సోషల్ మీడియాలో చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.