స్టార్ హీరోయిన్ అమీషా పటేల్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదట కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్‌లోను పలు సినిమాలో నటించి మెప్పించింది. ఇక.. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికి తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలో నటిస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయినా.. తాజాగా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే.. ఇప్పటికి తను సినిమాలో నటించాలంటే కచ్చితంగా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటుంది.
ఓల్డ్ పాత్ర చేయడానికి నో చెప్పేస్తూ అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. అయితే.. సినిమాలో నటించకపోయినా అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా.. ఓ ఫోడ్ కాస్ట్ లో అమీషా పటేల్ చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం నటింట వైరల్ గా మారాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో అమీషా పటేల్ తన చిన్నప్పటి క్రష్ గురించి వివరిస్తూ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఒక్కడే క్రష్.. అతనే హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఒప్పుకుంటా ఆయనతో ఓ నైట్ స్పెండ్ చేయడానికి కూడా నాకు ఎలాంటి సమస్య ఉండదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. సాధారణంగా హీరోయిన్లు తమ క్రష్ గురించి చెప్తారు కానీ.. మరి ఇంత బోల్డ్ గా ఓపెన్ గా రియాక్ట్ కారు. అమీషా ఈ విషయంలో ఈ రేంజ్ లో బోల్డ్ కామెంట్స్ చేయడం.. టామ్ క్రూజ్‌పై తనకున్న అభిమానం ఏంటో అర్థం అవుతుంది.
అంతేకాదు.. అంతకుమించినా ఫీలింగ్ ఏదో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమీషా.. ఇప్పుడు తన క్రష్ గురించి కొత్తగా ఏం చెప్పలేదు. గతంలో.. సాక్షాలతో సహా ఈ విషయం గురించి ఎన్నో సందర్భాల్లో వివరించింది. బాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఓ హాలీవుడ్ స్టార్ పై ఈ రేంజ్ లో ప్రేమాభిమానాలు కురిపించడం విశేషం. ఈ క్రమంలోనే ఆమె తన క్రష్ టామ్ గురించి మాట్లాడుతూ ఎప్పటికీ అతనే నా క్రష్.. అతని కోసం నేనేం చేసేందుకైనా రెడీ.. అతనిపై నాకున్న అభిమానం అలాంటిది. దానికోసం ఒక నైట్ అతనితో ఉండడానికి కూడా సిద్ధమే. నాకు అవకాశం ఉంటే తప్పకుండా పెళ్లి చేసేసుకునేదాన్ని అంటూ వివరించింది. ఈ క్రమంలో నెటిజన్స్ ఆమె కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ ఒక సెలబ్రిటీ మరో సెలబ్రిటీపై.. ఈ రేంజ్‌లో అభిమానాన్ని చూపించడం విడ్డూరంగా అనిపిస్తుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.