మెగా డాటర్ నిహారిక కొణిదెలకు పరిచయాలు అవసరం లేదు. మెగా ఇంటి నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదట్లో పలు సినిమాలకు హీరోయిన్గా మెరిసి నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయినా.. సినిమాలు పరంగా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కొద్దికాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈసారి కేవలం నటిగానే కాదు.. ప్రొడ్యూసర్ గారు తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా నిర్మించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డతో డివోర్స్ తర్వాత ప్రతి చిన్న విషయంలోనూ నెటింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో మరోసారి వైరల్ గా మారింది. పిల్లలు ఎవరైనా సరే అది స్టార్ సెలబ్రిటీస్ అయినా.. లేదా సాధారణ ప్రజలైన.. పేరెంట్స్, పిల్లలు బయటకు వెళుతున్నారు అంటే తగిన జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక వాతావరణం బాగోలేనప్పుడు టూర్లు, ట్రిప్పులు అని వారించి వాళ్ళు బయటకు వెళ్తే ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ట్రిప్‌లో వాళ్ళు చేసిన సాహసాలన్నీ తెలుసుకుంటే.. వాళకు తిట్ల దండకం తప్పదు.
ఇటీవల నిహారిక ఇటీవల ఓ ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తే.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో జలపాతానికి దగ్గరగా వెళ్లి సంతోషంగా గంతులు వేస్తూ కనిపించింది. ఇక ఈ వీడియోకు నేను సురక్షితంగా ఇంటికి వచ్చేయాలని మా మమ్మీ నాకోసం ప్రార్ధిస్తూ ఉంటుంది. కానీ.. నేను ఏమో ఇలా ఎంజాయ్ చేస్తున్నా. సారీ మమ్మీ అంటూ పోస్టులో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కు నిహారిక వదిన.. హీరోయిన్ లావణ్య త్రిపాటి రియాక్ట్ అవుతూ స్మైలీ ఇమేజ్‌ను పంచుకుంది. ఈ సరదా వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే వీడియో పై అలాగే.. నిహారిక రాసిన నోట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్.