నటుడు మనోజ్ బాజ్ పేయ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ నటుడే అయినా.. టాలీవుడ్‌లోను ప్రేమ కథ, వేదం, హ్యాపీ, కొమరం పులి లాంటి సినిమాలో నటించిన మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్.. రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో యాక్షన్ డ్రామా సర్కార్ 3లో నటిస్తున్నాడు. అంతేకాదు.. ఆయన నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ” పోలీస్ స్టేషన్ మెయిన్ బూత్ “. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటి జెనీలియా దేశ్ ముఖ్ లీడ్ రోల్ లో మెరవనుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో సందడి చేశాడు మనోజ్ వాజ్‌పాయ్. ఇక ఈ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మనోజ్ మాట్లాడుతూ ఆర్జీవి కథ వినకుండా నేను సినిమాకు సైన్ చేశా అంటూ వివరించాడు. నా దగ్గర ఓ స్టోరీ ఉంది.. హైదరాబాద్ రమ్మని రామ్ గోపాల్ వర్మ నాకు చెప్పారు. నేను నా రోల్ ఏంటి అని కూడా అడగలేదు.. వెంటనే ఓకే చెప్నేశా. నేను తప్పకుండా హైదరాబాద్ వస్తున్న అన్ని చెప్పా అంటూ వివరించాడు.
అయితే.. 1988లో మనోజ్ వాజ్‌పాయ్, ఆర్జీవి కల్ట్ గ్యాంగ్స్టర్ మూవీ సత్య సినిమాకు కలిసి పని చేశారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్యన బాండ్ ఇప్పటికీ కొనసాగుతుందట. ఈ ర్యాపోతోనే మనోజ్ వెంటనే ఓకే చెప్పినటకలు టాక్. ఇక ఈ మూవీ ఆగస్ట్ చివరి వారంలో హైదరాబాద్‌లో సెట్స్ పైకి రానుంది. కాగా.. ఈ సినిమా సెకండ్స్ షెడ్యూల్లో మనోజ్ పందడి చేస్తాడట. నవంబర్ నుంచి సెకెండ్ స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా.. ప్రస్తుతం మనోజ్ వాజ్‌పాయ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.