టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అందరితో పంచుకుంటున్నాడు. అలా మీరాయ్ సినిమా టికెట్ రేట్ లపై మాట్లాడుతూ.. టికెట్ ధరలు పెంచే ఆలోచన అసలు లేదని.. ఎక్కువ మంది ఆడియన్స్ సినిమా థియేటర్లో చూడాలని ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా వెల్లడిస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీరాయ్ ప్రెస్మీట్లో టీజి విశ్వప్రసాద్ రాజసాబ్ సినిమా ట్రైలర్ పై కీలక అప్డేట్ను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లోకి రానుందని వెల్లడించాడు.
అంతేకాదు.. రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా థియేటర్స్‌లో ది రాజాసాబ్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నామని వివరించాడు. అంటే.. అక్టోబర్ 2న రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుఉందని చెప్పకనే చెప్పేసాడు. అంతేకాదు.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. టీజి విశ్వప్రసాద్ షేర్ చేసుకున్న ఈ అప్డేట్స్తో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ముందు ముందు వచ్చే ప్రమోషన్స్ తో సినిమాపై ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ అవతుందో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.