టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. పాన్ ఇండియా లెవెల్ మోస్ట్ అవైలెడ్ మూవీగా ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. కేవలం పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరువనున్నారు. ఇక ఈ సినిమాతో సుజిత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటినీ క్రియేట్ చేసుకోవాలని.. ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ పాత్రలో నటిస్తుంటే.. ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రలో మెరవనున్నాడు. వీళ్లిద్దరు బద్ధ శత్రువులు అన్నట్లు మేకర్స్ ఎప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వైరల్ గా మారుతుంది. ఓ.జి. ఓమి ఇద్దరూ సొంత బ్రదర్స్ అని.. వాళ్ళిద్దరి మధ్యన జరిగే వారే ఓజీ సినిమా అంటూ సమాచారం. ఇంతకీ వీళ్లిద్దరి మధ్యన వార్ ఏంటి. ఒకళ్ళు మంచిగా ప్రవర్తిస్తుంటే.. మరొకరు విలన్ గా ఎందుకు మారాను అనేదే సినిమా అసలు స్టోరీ. ఇక సుజిత్ దాదాపు ఈ సినిమాను జపనీస్ డైరెక్షన్ స్టైల్ లోనే రూపొందించినట్లు.. ఇప్పటికే విజువల్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
ఇంతకీ ఓజీ, ఓమీ మధ్యన వార్ ఎందుకు మొదలైంది.. వీళ్లిద్దరి మధ్యన జరిగే వార్ ఆడియన్స్ ను సిట్ ఎడ్జ్‌కు తీసుకువెళ్లేలా సుజిత్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశాడట. తమ ఫ్యామిలీ ఎఫెక్ట్ వల్లే ఇద్దరిలో ఒకరు విలన్‌గా.. మరొకరు హీరోగా మారినట్లు సమాచారం. ఇక రఓజి సినిమాతోనే మొదటిసారి ఇమ్రాన్ హష్మి టాలీవుడ్‌ను పలకరించనున్నాడు. ఇక గతంలో తెరకెక్కించిన సాహో సినిమా పెద్దగ టాలీవుడ్ లో సక్సెస్ అందుకోకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓజీ విషయంలో మాత్రం లెక్కలు అలా అస్సలు తారుమారు కావని.. ఓజీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం వస్తున్న ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడు.. ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొడతాడు అనే ఆసక్తి అభిమానులలో మొదలైంది.