పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయ్యింది. సుజిత్ డైరెక్షన్లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా రూపొందిన ఈ సినిమాలో.. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా మెరిసింది. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ఆడియన్సే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు.. సినిమా రిలీజై.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ కు ముందే భారీ ఓపెన్ బుకింగ్స్‌తో రికార్డ్‌లు సృష్టించిన ఓజీ.. రూ.100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.
ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ కాకుండా.. మరో బాలీవుడ్ బ్యూటీ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే.. ఆమె హైయెస్ట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. తన్నును రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే. మొదట ఈ సినిమాలో హీరోయిన్ కోసం దీపికను మేకర్స్ కలిసారట. సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. రూ.16 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం.. మేకర్స్ రూ.10 కోట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉండటంతో.. ఆమెను తప్పించి ప్రియాంక అరుళ్ మోహన్ ట్రాక్ లోకి వచ్చింది.
అలా పవన్‌తో నటించే జాక్‌పాట్ ఆఫర్లు దీపిక మిస్ చేసుకుంది. గతంలోని వీళ్ళిద్దరి కాంబో ఒకసారి మిస్సయింది. పవన్ నటించిన కొమరం పులి తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో మూవీ రావాల్సి ఉండగా.. ఏవో కారణాలతో ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయింది. ఇక మూవీ కోసం మొదట అనుకున్నట్లుగానే దీపిక హీరోయిన్గా నటించి ఉంటే.. బాలీవుడ్లో సినిమాకు మరింత క్రేజ్ పెరిగేది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే.. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దీపిక.. అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ కమర్షియల్ సక్సెస్ లో అందుకుంది. ఎంత పాపులర్ స్టార్ హీరోయిన్ అన్న ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడం మేకర్స్‌కు నచ్చలేదు దీంతో వాళ్లు ఆమెను కాదని ప్రియాంకకు స్టోరీ వినిపించారు. తను వెంటనే గ్రైన్ సిగ్నల్ ఇవ్వడం.. సినిమాలో నటించడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.