‘ OG ‘ ఓటీటీ డీల్ లాక్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

ప్రెసెంట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఓజీ హవా కొనసాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రూపొందిన ఓజీ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ప‌వ‌న్‌ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫుల్ మీల్స్‌ అనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవర్ స్టార్ అభిమానులు కాదు.. సాధారణ ఆడియ‌న్స్‌కు సైతం ఈ సినిమా న‌చ్చేసింది. పవన్ కెరీర్ మొత్తంలో.. ఒక్కసారిగా ప‌వ‌న్‌ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించేటప్పటికీ ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు.

ఆయన స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్ కేవలం ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రిటీల‌కు సైతం న‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే చాలామంది సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ స్ప్రెడ్ అవుతుంది. ఇక ఓజీ ప్రీమియర్ షోస్ రెస్పాన్స్‌తో మొదటి రోజు థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే.. ఫస్ట్ డే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. తాజాగా సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట.

OG is back, and everybody is about to feel the heat! ♨️ OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga . . @pawankalyan @

దాదాపు.. రూ.92 కోట్ల భారీ ధరకు ఈ డిజిటల్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. 6 నుంచి 8 వారాల తర్వాత ఈ సినిమాను ఆడియన్స్‌ ఎంజాయ్ చేయవచ్చు అంటూ.. దీపావళి కానుకగా సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రతో టాలీవుడ్ డబ్యూ ఇచ్చారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్‌, అర్జున్ దాస్, సుదేవ్ నైర్, శ్రీయ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమా మొత్తానికి హైలెట్ థ‌మన్ మ్యూజిక్. డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మొదటి రోజే చాలా థియేటర్లో బ్రేక్ ఇవ్వని కూడా టచ్ చేసినట్లు తెలుస్తుంది. ముందు ముందు ప్రొడ్యూసర్లకు ఓజీ ఏ రేంజ్‌లో లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి.