ఓజీ: నైజాం బెనిఫిట్ షోస్ పై బిగ్ సస్పెన్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో.. పవన్ ఫ్యాన్సే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఓజీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇక సినిమాకు ఒక రోజు ముందు అంటే 24న ఆంధ్రాలో ప్రీమియర్ షోస్ వేసేందుకు ఇప్పటికే అన్ని సిద్ధమైపోయాయి. ప్రీమియర్ టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు కూడా ఏపీ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చేసింది. 1000 రూపాయలకు టికెట్ కాస్ట్ ను పెంచడం విమర్శలకు సైతం దారితీసింది. ఇలాంటి క్రమంలో నైజాం బెనిఫిట్ షోస్‌పై బిగ్గెస్ట్ సస్పెన్స్ మొదలైంది.

గతంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా నైజాంలో ప్రీమియర్స్‌కు బెనిఫిట్ షోలకు గవర్నమెంట్ పర్మిషన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓజీ రిలీజ్‌కు నైజాంలో భారీగా ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ సందేహాల్లో మునిగిపోయారు. అలాగే.. రిలీజ్ రోజు నాడు తెల్లవారుజామున 1AM ,4AM షో విష‌యంలోను ఇంకా క్లారిటీ రాలేదు. స్పెషల్ షూస్ వేసుకునేందుకు అసలు పర్మిషన్ ఇస్తారా.. లేదా.. వేచి చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ 21న‌ హైదరాబాద్ళ‌క్ష‌ గ్రాండ్ఘౄ జరగనుంది.