డబ్బు కోసం వేరే వ్యక్తితో పడుకునే టైప్ కాదు.. బిగ్ బాస్ పై స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ రియాల్టీ షోకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కేవలం తెలుగు కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా బిగ్ బాస్ తెరకెక్కి సీజన్ల‌పై సీజన్స్‌ కొనసాగిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ ద‌త్త బిగ్ బాస్ పై చేసిన సెన్సేష‌న‌ల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిగ్‌బాస్ పై హాట్ కామెంట్స్ చేసింది. గత 11 సంవత్సరాలుగా.. నాకు బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఆఫర్ వస్తూనే ఉందని.. అయినా ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్నానంటూ తనుశ్రీ చెప్పుకొచ్చింది.

Tanushree Dutta calls Hema Committee Report 'useless': 'People like Nana  Patekar, Dileep are...' – Firstpost

ఈ ఏడాది అయితే రూ.1.65 కోట్లు ఆఫర్లు కూడా రిజెక్ట్ చేశానని వివరించింది. రియాలిటీ షోలలో ఒకే బెడ్ పై వేరే వ్యక్తితో పడుకోవాల్సి వస్తుందని నేను అలా పడుకోలేను అంటూ హాట్ కామెంట్స్‌ చేసింది. నేను అంత చీప్ పర్సన్ ని కాదని.. హాల్లో ఒకే బెడ్ పై మరో వ్యక్తితో పడుకోవాలి.. బిగ్ బాస్ లో స్త్రీలు, పురుషులు ఒకే హాల్లో ఉంటారు సరికదా.. ఒకే బెడ్ పై మరొక వ్యక్తితో పడుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. అలా నేను ఉండలేను. నేను అలాంటి పర్సన్ కూడా కాదు. నాకు అలా ఉండడం అసలు నచ్చదు అంటూ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం తనుశ్రీ దత్త కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. నచ్చకపోతే.. నచ్చలేదని రిజెక్ట్ చేయడం వరకు బానే ఉంది. కానీ.. ఇలా నెగటివ్ గా ప్రచారం చేయడం సరికాదని మండిపడుతున్నారు. కేవలం బిగ్ బాస్ ఒక రియాలిటీ షో కాదని.. ఎంతోమందికి కెరీర్‌లో మంచి ప్లస్ గా మారిందని.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు, సీరియల్స్ అంటూ అవకాశాలను దక్కించుకొని సత్తా చాటుకుంటున్నారని.. అలాంటి ఓ రియాలటీ షోపై ఇలాంటి చెత్త కామెంట్స్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు.