బడా బడ్జెట్ హంగులు వద్దు బలమైన కంటెంటే ముద్దు..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా బడ్జెట్‌తో సంబంధం లేకుండా.. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే బడా బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. వెనుక ముందు చూసుకోకుండా భారీ ఎత్తున ఖర్చులు చేస్తూ హంగులు చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలను పెట్టి భారీ ఆకర్షణగా నిలిచేందుకు సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టగలిగే అసలైన మంత్రం బలమైన కంటెంట్ అని వాళ్ళు మర్చిపోతున్నారు. దీంతో వందల కోట్లలో నష్టం వాటిల్లుతుంది. అలా ఇప్పటివరకు భారీ ప్రాజెక్టులుగా.. బడా బడ్జెట్‌తో తెర‌కెక్కి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.

This Friday Also Belongs to Mahavatar Narsimha

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లకు భారీ నష్టాలు తప్పవని ఆడియన్స్ ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నా.. మళ్ళీ వాళ్లంతా అదే దారిలో వెళ్తున్నారు. అలాంటి టైం లోనే బలమైన కంటెంట్తో అతి తక్కువ బడ్జెట్లో తెర‌కెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ లో మెప్పిస్తున్నాయి. హాంగులకంటే బలమైన కథలే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయని రుజువు చేస్తున్నాయి. అలా ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ప్రతి ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ కాగా.. వాటిలో 200 నుంచి 500 కోట్ల బడ్జెట్లో నిర్మించబడిన సినిమాలు మాత్రం డజను దాకా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన కూలీ, వార్ 2, గేమ్ ఛేంజర్, థ‌గ్‌ లైఫ్, సికందర్, హౌస్ ఫుల్, ఎల్ 2 ఎంపురాన్, హరిహర వీరమల్లు ఇలా భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్, గ్రాఫిక్స్, సెట్లతో విపరీతమైన సందడి చేసి ఆడియన్స్లో అంచనాలను ఆకాశనికందించి.. రూ.1000 కోట్లు కన్ఫామ్ అంటూ ఊరించిన.. చివ‌ర‌కు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి ఘోరమైన డిజాస్టర్లు గా నిలిచాయి.

అయితే చిన్న సినిమాగా వ‌చ్చిన సయ్యారా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే.. పరిమిత బడ్జెట్ తో నిర్మితమైన‌.. ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చిన మహా అవతారం నరసింహా ఎలాంటి సక్సెస్ అందుకుందో చూస్తూనే ఉన్నాం. ఈ రెండు సినిమాల్లో స్టార్ హంగులేవి లేకున్నా.. భాషతో సంబంధం లేకుండా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఎమోషన్స్ తో నిండిన బలమైన కథ దీనికి కారణం అని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పదులకోట్ల బడ్జెట్ తో వ‌చ్చిన‌ సినిమాలు వందల కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపాయి.

Mirai Telugu theatrical business: PMF plays it smart, breakeven within reach

ఇక లిమిటెడ్ బడ్జెట్ తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్‌, లిటిల్ హార్ట్స్‌ లాంటి సినిమాలు టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. పరభాష నుంచి వచ్చిన తుడరుం, సు అండ్ సో, లోక చాప్టర్ 1 చంద్ర, టూరిస్ట్ ఫ్యామిలీ, రేఖ చిత్రం, డ్రాగన్ లాంటి సినిమాలు కూడా మంచి రిజల్ట్ అందుకున్నాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చుకు పదింతలు లాభాలు తెచ్చి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ప్రజెంట్ యంగ్‌ హీరో తేజ సజ్జ పాన్‌ ఇండియన్ మూవీ మిరాయ్‌ కూడా.. తక్కువ బడ్జెట్‌తో మంచి రిజల్ట్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికైనా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు.. బడ్జెట్ పై కాకుండా కంటెంట్ పై శ్రద్ధ పెడితే బాగుంటుంది.