డైరెక్ట్ ర్ సుకుమార్ వల్ల నా కెరీర్ పోయింది.. అనుపమ పరమేశ్వరన్

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అందంతో పాటు.. అద్భుతమైన నటన, మాట తీరుతో అందరినీ నొప్పిస్తున్న ఈ అమ్మడు.. మొదట్లో కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అలా గ‌తేడాది టిల్ల స్క్వేర్‌లో ఓ బోల్డ్ పాత్రలో నటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Not Samantha, Anupama Parameswaran was the first choice for Rangasthalam -  India Today

ఈ ఏడది పరదా అనే మరో వైవిధ్యమైన మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అమ్మడు హారర్ మూవీ కిష్కిందపూరితో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అనుప‌మ‌ మాట్లాడుతూ.. రంగస్థలం మూవీ టైంలో హీరోయిన్ రోల్ కోసం డైరెక్టర్ సుకుమార్ నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. కానీ.. ఇంతలో నాకు చెప్పకుండా మరో హీరోయిన్ ని తీసేసుకున్నారు.. మీడియా దాన్ని అనుప‌మనే.. రాంచరణ్‌ను రిజెక్ట్ చేసిందని నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.

కేవలం ఆ ఒక్క రూమర్ కారణంగా నాకు 6 నెలల పాటు సినిమా ఆఫర్లు రాలేదు. వచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కెరీర్‌లో ట‌ఫ్ టైం ఎదుర్కొన్న. మానసికంగాను దెబ్బతిన్నా అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అనుపమ కామెంట్స్ మరోసారి నెటింట‌ వైరల్‌గా మారడంతో.. సోషల్ మీడియాలో నెటిజ‌న్స్‌ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ హీరోయిన్ సంప్రదించి ఆమె వెంటనే ఒప్పుకున్న తర్వాత కూడా మరో హీరోయిన్ తీసుకోవడం. దానిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆమెకు ఇవ్వకపోవడం.. సుకుమార్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని.. సుక్కుమార్ లాంటి ఓ పాపులర్ డైరెక్టర్ ఇలాంటి పనులు చేస్తాడని అసలు ఊహించలేదంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.