తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖలతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దాని వెనుక రీసన్ చాలా పెద్దదే. ఈ సమావేశంలో హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ అందరూ హాజరయ్యారు. సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్‌లో విక్రయిస్తున్న దేశాల్లో అతిపెద్ద పైరసీ ముఠాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్ తో పాటు.. కొన్ని సాంకేతిక పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిపి ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులు కొత్తగా రిలీజ్ అయిన తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ tamil MV, thali blusters, movieruls ద్వారా అమ్మకాలు జరుపుతూ.. కోట్లల్లో సంపాదిస్తున్నారని వెల్లడించారు.
దీని ద్వారా సినీ ఇండస్ట్రీకి రూ.22, 400 కోట్ల నష్టం వాటిల్లిందంటూ చెప్పుకొచ్చారు. సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని ఈ విషయంపై జూలై మూడున వనస్థలిపురానికి చెందిన కిరణ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వివరించాడు. విచారణలో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా దుబాయ్, నెదర్ ల్యాండ్, మయన్మార్ ఇలా పలుచోట్ల పైరసీ ముఠాలు ఉన్నాయని గుర్తించామని.. వీరు థియేటర్‌లో ప్రదర్శన అయ్యే.. శాటిలైట్ కంటెంట్.. ఐడి పాస్పోర్టులను క్రాక్ చేస్తూ సినిమాలను ఆన్లైన్ ప్లాట్ఫారంలో అప్లోడ్ చేస్తున్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఏజెంట్లు ఫ్రంట్‌జేబుల్లో సిగరెట్ ప్యాకెట్లు.. పాప్ కార్న్ ప్యాక్స్ పై.. హై అండ్ కెమెరాలు పెట్టి థియేటర్లలో స్పెషల్ యాప్ ద్వారా సినిమాలు రికార్డ్ చేస్తున్నారని గుర్తించాము. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు అందిస్తున్నారు అంటూ ఆనంద్ వెల్లడించాడు. ప్రధాన నిందితుడు కిరణ్ కుమార్ ఇప్పటివరకు 40 సినిమాలు పైరసీ చేసినట్లు సిపి ఆనంద్ వివరించాడు. ఈ కేసులో రెండో వ్యక్తి రాజు అమలాదాస్ వెబ్సైట్ ద్వారా పైరసీలు చేసి గేమింగ్ సైట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలో డబ్బులను కన్వర్ట్ చేస్తున్నట్లు వివరించారు. మరో నిందితుడు అశ్విని కుమార్ క్యూబ్ సినిమాస్ లాంటి మూవీ ప్రొవైడర్ సంస్థల సర్వర్ హ్యాక్ చేసి కొత్త సినిమాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడని.. దీంతో పాటు పలు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసినట్లు పోలీసులు వివరించారు.