మీరాయ్: ఆ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే

టాలీవుడ్ హీరో తేజ స‌జ్జా, కార్తీక్ ఘట్టబ‌నేని కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మీరాయ్‌. మంచు మనోజ్ విలన్ గా, శ్రియా శరణ్‌ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పాజిటివ్ హైన్‌ నెలకొంది. ఇలాంటి క్రమంలో సినిమాలో.. శ్రేయకు సంబంధించిన ఓ గుడ్ సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉందంటూ న్యూస్ తెగ సందడి చేస్తుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన శ్రీయ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ,ప్రభాస్, పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా దాదాపు అగ్ర హీరో లంద‌రి సరసన నటించి స్టార్ ఇమేజ్‌ సొంతం చేస్తుంది.

అయితే.. పెళ్లి తర్వాత అమ్మడు భర్త, కూతురు అల‌నాపాల‌నా చూసుకుంటూ సినిమాలకు దూరమైంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్‌ఆర్ఆర్ లో అజయ్ దేవగణ్‌ భార్య‌గా మెరిసింది. ఇక కన్నడలో కబ్జా, తెలుగులో మ్యూజిక్ స్కూల్ సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేదు. మ‌ళ్లీ 2 ఏళ్ల‌ తర్వాత ఇప్పుడు మీరాయ్‌తో స్ట్రాంగ్ రోల్లో మెరిసేందుకు సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే గతంలో శ్రిమా నటించిన బాలు, ఠాగూర్, ఛ‌త్రపతి సినిమాల్లో తేజ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మీరామ్ లోను శ్రీయ.. తేజ సజ్జకు తల్లిగా మెరవనుంది.

Actress Shriya Saran Speech at Mirai Trailer Launch Event | Teja Sajja |  Manchu Manoj

ఈ మూవీలో చాలా కీలకమైన పాత్ర అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత్ర గురించి శ్రియా సైతం ఎన్నో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చింది. సెప్టెంబర్ నాకు చాలా లక్కీమంత అంటూ కూడా ఆమె వివరించింది. ఆమె నటించిన ఛ‌త్రపతి, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి సినిమాలు సెప్టెంబర్ లోనే రిలీజై.. ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శ్రీ‌లీల‌కు సంబంధించిన ఈ రెండు పాజిటివ్ సెంటిమెంట్స్‌ వర్కౌట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.