ఓపెన్ బుకింగ్స్ లో ” మీరాయ్ ” రికార్డుల ఊచకోత.. తేజ సజ్దా రేంజ్ ఇది..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ఈ యాక్షన్ అడ్వెంచర్స్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రూపొందింది. ఇక ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కు రిలీజ్ కానుంది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్లలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం ఆడియన్స్‌ను భారీ లెవెల్ లో ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా సినిమా ఓపెన్ బుకింగ్ ప్రారంభమైనా.. మొదట్లో సినిమాకు ఊహించిన రేంజ్‌లో బుకింగ్స్ జరగకున్నా.. తేజ సజ్జకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌తో.. మెల్లమెల్లగా సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

Mirai to Be a Pan-World Franchise, Makers Say

ఈ క్రమంలోనే సినిమా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పై రికార్డ్ లెవెల్ లో బుకింగ్స్ అందుకుంటూ త‌న‌ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే.. సినిమాకు ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడు పోవడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. టికెట్ ధరలను పెంచకుండా రీజనబుల్ కాస్ట్ పెట్టడం. ఇక దీనివల్ల ఎక్కువ మంది ఆడియన్స్ సినిమాను చూసేందుకు ముందుకు వస్తారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తక్కువ రేట్లతో.. ఎక్కువమంది ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించుకుంటే తము అనుకున్న టార్గెట్ ను సులభంగా రీచ్ అవ్వచ్చనే ప్లాన్‌లో ఉన్నారట. ఈ విషయం ఇటీవల మూవీ ప్రొడ్యూసర్ టీజే విశ్వప్రసాద్ సైతం స్వయంగా వెల్లడించారు.

Mirai: Manchu Manoj's First Look As The Black Sword In Teja Sajja's Super  Yodha Flick Out!

ఇక సినిమా ఫుల్ లెవెల్ లో బుకింగ్స్ ప్రారంభమైతే.. మీరాయ్‌.. ఏ రేంజ్ లో కలెక్షన్ కొల్లగొడుతుందో అనే ఆసక్తి అభిమానులో మొదలైంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వినూత్నమైన కాన్సెప్ట్ తో అదిరిపోయే విజువ‌ల్స్‌తో.. సినిమాను రూపొందించాడని.. తేజ స‌జ్జా క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌ను మూవీ ఏ నేంజ్‌లో ఆకట్టుకుంటుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.