టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ సక్సెస్ తర్వాత రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే.. ఆడియన్స్‌లో భారీ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. కేవలం.. మౌత్ టాక్‌తోనే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా.. సినిమాకు క్యూ కట్టేలా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు మేకర్స్.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే కూడా దగ్గరుండి చూసుకున్నాడు. మంచు మనోజ్ సినిమాలో విలన్ పాత్రలో మెరువగా.. రితికా నాయక్ హీరోయిన్గా ఆకట్టుకుంది. జగపతిబాబు, శ్రియ శరన్ కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే, కథతో పాటు ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ ఆకట్టుకుందని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ.91.45 కోట్ల గ్రాస్ వసూళ్లలు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.
ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకు సైతం నాలుగు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ కష్టమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. రూ.100 కోట్లకు చేరువగా వచ్చిన మిరాయ్.. ఐదవ రోజు కలెక్షన్స్ తో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో హనుమాన్ రికార్డులను సైతం తేజ బ్రేక్ చేస్తాడా.. లేదా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.