యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఇప్పటికి థియేటర్లో మంచి ఆక్యుపేన్సితో సందడి చేస్తుంది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కచ్చితంగా సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని.. హనుమాన్ రికార్డులను సైతం బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ.. తేజ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్, విజువల్స్, స్క్రీన్ ప్రతి ఒకటి ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఐదు రోజులలో సక్సెస్‌ఫుల్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. ఈ క్రమంలోనే.. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ నిన్న విజయవాడలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఆడియన్స్ భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇక ఈ ఈవెంట్లో హీరో తేజ సజ్జ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో పాటు.. మంచు మనోజ్, హీరోయిన్ రితిక నాయక్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, శ్రేయ శరణ్ సందడి చేశారు. ఇందులో భాగంగానే సక్సెస్ ఈవెంట్లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. తేజ సజ్జ, కార్తిక్‌లకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కారణంగా తేజ, కార్తీక్ ఘట్టమనేనిలకు రేంజ్ రోవర్ లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇవ్వనన్నట్లు వెల్లడించాడు. ఈ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వినగానే హీరోతో పాటు డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు.