‘ మిరాయ్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. “హనుమాన్ ” రికార్డ్స్ బ్రేక్ చేసి తేజ సజ్జ ఊచకోత..!

టాలీవుడ్ హీరో తేజ సజా హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్ నిన్న గ్రాండ్ లెవెల్లోరిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రితిక నాయక్‌ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్‌, జగపతిబాబు కీలక పాత్రలో మెరిసారు. ఇక రిలీజ్‌కు ముందే మంచి హైప్‌ నెలకొల్పిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కొల్ల‌గొట్టింది. ఇంతకీ ఇక్కడ అస్సలు రికార్డు ఏంటంటే.. మీరాయ్‌ మొదటి రోజు కలెక్షన్లతోనే హనుమాన్ ఓపెనింగ్ కలెక్షన్స్ (ప్రీ రివ్యూలు తీసేస్తే) కంటే ఎక్కువగా కలెక్షన్లను దక్కించుకుంది.

కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌సంస‌లు అందుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మొదటి రోజు మార్నింగ్ షో ఆక్యుపెన్సీతో పోలిస్తే నైట్ షోలకు ఆక్యుపేసి త్రిబుల్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో దాదాపు రూ.12 కోట్ల వరకు వసూళ్ల‌ను కొల్లగొట్టిందని సాక్‌నిల్క్ వెల్లడించింది. తేజ సజ్జా గత సినిమా హనుమాన్‌తో పోలిస్తే.. ఇది రూ.4 కోట్లు ఎక్కువ.

Mirai (2025) - IMDb

2024 లో రిలీజ్ అయిన హనుమాన్ ఫస్ట్ డే రూ. 8.05 కోట్లు వ‌శుళ్ల‌ను దక్కించుకుంది. అయితే.. హనుమాన్ రిలీజ్ ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేయడంతో.. వాటికి రూ.4.15 కోట్ల వసూలు వ‌చ్చాయి. అలా ఓపెనింగ్ కలెక్షన్స్ రూ.12.2 కోట్లుగా కౌంట్ చేశారు. ఇక ప్రస్తుతం తేజ నటించిన మిరాయ్‌ మూవీ బడ్జెట్ రూ.60 కోట్లు. దీనిబట్టి చూస్తే మొదటి రోజే 20 శాతం వసూళ్లు రిటన్ బ్యాక్ వచ్చేసాయి. ఇక నేడు, రేపు వీకెండేస్ కావడంతో ఈ సినిమాకు మరింత కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫైనల్ రన్ లో తేజ సజ్జ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.