యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో కలెక్షన్ల పరంగాను సత్తా చాటుతుంది. సినిమాకు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. మనోజ్, తే. నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. ఒకరికి ఒకరు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారంటూ, లొకేషన్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి అంటూ ప్రశంసలలు కురుస్తున్నాయి. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రేంజ్.. క్వాలిటీ చూస్తుంటే.. రూ.400 కోట్ల బడ్జెట్ మూవీలా అనిపించిందని.. ఇలాంటి సినిమా చూసేందుకు ఆడియన్స్ టికెట్ కొనడంలో అసలు తప్పు లేదంటూ.. ఇప్పటికే సినిమా చూసిన నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక వాళ్ళ రివ్యూలకు తగ్గట్టుగానే ఫస్ట్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. తేజ సజ్జ లాంటి మీడియం రైలు హీరోకి.. ఈ రేంజ్ వసూళ్లు అంటే.. సాధారణ విషయం కాదు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే సినిమా మౌత్ టాక్ తోనే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో టికెట్లు కూడా అందడం లేదు. ఆ రేంజ్‌లో సినిమాకు క్రేజ్ ఉంది. అలా.. మొదటి రోజు బుక్ మై షో లో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోగా.. సెకండ్ డే అంతకు మించి టికెట్ల్ బుకింగ్స్ జరిగాయట.
ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమాకు రెండో రోజు కూడా బుక్ మై షో లో 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నైట్ షోలకు ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫస్ట్ డే కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే రేంజ్ లో కలెక్షన్లు కొనసాగితే సినిమా రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం చాలా సులభం. ఇక సెప్టెంబర్ 25న ఓజి సినిమా రిలీజ్ కానుంది. అప్పటివరకు ఈ సినిమాకు డోకా లేదు. ఇక సినిమా రూ.300 కోట్ల వసుళ్లను కొల్లగొట్టిందంటే చాలు.. బ్లాక్ బస్టర్ రికార్డ్ ను క్రియేట్ చేసినట్లే అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాకు సైతం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ రేంజ్ లో టికెట్స్ బుక్ కాలేదని.. బుక్ మై షో లో మిరాయ్ సంచలనంతో ప్రభాస్ రికార్డ్ డేంజర్ లో పడనుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.