” మీరాయ్ ” వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రీ రిలీజ్ బిజినెప్.. టార్గెట్ లెక్క‌లివే..!

టాలీవుడ్ హీరో తేజ స‌జ్జ‌ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక థియేటర్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిన మేకర్స్.. సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

HanuMan star Teja Sajja's Next Titled Mirai | Telugu - Times Now

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బేస్ మీద ఇతర డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తుండగా.. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో గట్టిగా అడ్వాన్స్ లో రాబట్టిందట. ఈ క్రమంలోనే సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ బిజినెస్ లెక్కలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నైజాంలో రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, ఆంధ్రాలో రూ.12 కోట్లు.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 27 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఆంధ్ర, అలాగే డబ్బింగ్ కలుపుకొని.. రూ.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

ఓవర్సీస్ లో రూ. 4.5 కోట్ల బిజినెస్ మీఱౄయ్ జరుపుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా మీరాయ్‌.. రూ.36.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకుంది. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ.37.50 కోట్ల షేర్ కొల్ల‌గొట్టాల్సి ఉంది. అంటే.. తేజ సినిమాకు రూ. 30 కోట్ల షేర్ దాటితే చాలు మేకర్స్ లాభాలు మొదలవుతాయి. మొత్తం మీద రూ.37.5 కోట్ల షేర్ మార్కెట్ చేస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్‌ల‌తో సహా అందరికీ లాభాల వర్షం కురిసినట్టే. ఇక ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ క్రియేట్ అవ్వడం.. అలాగే తేజ సజ్జాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకు పెద్ద బూస్టప్ కానుంది. తేజ ఈ సినిమాతో మరో బ్లాక్ బ‌స్టర్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.