” మీరాయ్ ” మూవీ ఫస్ట్ రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మరికొద్ది రోజుల్లో మీరాయ్‌ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పనిచేశాడు. మంచు మనోజ్‌, శ్రియ శరణ్‌ తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా.. పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ డ్రామాగా రూపొందింది. ఇక సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మ‌ళ‌యాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక స్టార్ బ్యూటీ శ్రియ శరణ్‌.. తన కెరీర్‌లో మొదటిసారి ఈ సినిమా కోసం తల్లి రోల్‌లో కనిపించనుంది. ఇక మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రతి ఒక్కటి ఆడియన్స్ లో ఇప్పటికే మంచి హైప్‌ను నెలకొల్పింది.

Teja Sajja Karthik Gattamneni New Upcoming Movie title glimpse announcement  poster

పాజిటివ్ రెస్పాన్స్ ని ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ రివ్యూ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇటీవల సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని.. యు ఏ 16+ సర్టిఫికెట్ అందుకుంది. అంటే పదహారేళ్ల నిండిన యువతి, యువకులు సినిమాను చూడవచ్చు. ఇక ఈ క్రమంలోనే సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల రివ్యూ ఏంటి.. రన్ టైమ్ ఇతర వివరాలు ఒకసారి తెలుసుకుందాం. సినిమాను పూర్తిగా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందజేశారు. డిఫరెంట్ కథ‌, కథనాలతో సినిమా ఆడియన్స్ను కచ్చితంగా ఆకట్టుకునేలా ఉందని.. తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు మూవీ టీం తెలిపారు. సూపర్ యోధ తేజ సజ్జ క్యారెక్టర్ ను కార్తిక్ డిజైన్ చేసిన విధానం సరికొత్తగా ఉందని.. మంచు మనోజ్ పెర్ఫార్మెన్స్ పరంగా స్ట్రాంగ్ కాంపిటీషన్ అంటూ వివరించారు.

Teja Sajja's Mirai New Release Date Announced

ఇక సినిమా ర‌న్ టైం ఇప్పటి వరకు తెరకెక్కిన అన్ని పాన్ ఇండియన్ సినిమాల రన్ టైం కంటే చాలా తక్కువేన‌ట‌. కేవలం 169 నిమిషాలు అంటే.. దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్ టైంతో సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక రన్ టైమ్ ను బట్టి సినిమా చాలా షార్ప్‌ అండ్ ఫాస్ట్ గా ఉంటుందని అంత భావిస్తున్నారు. ఎలాంటి ల్యాగ్‌ లేకుండా సినిమాను చాలా క్లియర్ కట్‌గా తీశారట. ఆధ్యతం కొన్ని విఎఫ్ ఎక్స్ గ్రాఫిక్స్ అంశాలు.. ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు తెలుస్తుంది. మదర్ సెంటిమెంట్ తో సాగే.. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెబుతున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టాండర్డ్ కు తగినట్టుగా హై రేంజ్ లో సినిమా ఉందని.. పాన్ ఇండియా ఆడియన్స్ను కచ్చితంగా టచ్ చేసేలా సబ్జెక్ట్ డిజైన్ చేశారని అంటున్నారు. ఇక సినిమా రిలీజై.. ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సవం కాయం.