యంగ్ యాక్టర్ మౌళి హీరోగా టాలీవుడ్ డబ్యూ ఇస్తున్న మూవీ లిటిల్ హార్ట్స్. శివాని నాగరం హీరోయిన్గా.. రాజీవ్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకుడిగా వ్యవహరించారు. సోషల్ మీడియా షాట్స్ తో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మౌళి.. తర్వాత 90 స్ కిడ్స్ వెబ్ సిరీస్ ద్వారా స్టార్ యాక్టర్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తన మొదటి ప్రాజెక్టు తోనే టాప్ ఆర్డర్ టీం దొరికారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలవడం.. ఈటీవీ విన్ అధినేత.. నితిన్ సాయి.. 90స్ కలిసి సినిమాకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించడంతో.. సినిమాపై హైన్ నెలకొంది.
అంతేకాదు.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో పాటు.. ప్రమోషనల్ ఈవెంట్స్ తోను మంచి అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. దానికి తోడు ముందే రిలీజ్ అయిన ప్రీమియర్ షోస్ కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపు మొదటి రోజు కలెక్షన్స్ తోనే 50% రికవరీ అయిపోయిందని సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు రూ.2.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ వసూలను రాబట్టాల్సి ఉంది. అయితే.. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్గా సినిమా 50% పైగా రికవరీ చేసేసిందట.
సినిమా వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు(ప్రిమియర్స్ కలుపుకుని) కలెక్షన్స్ రూ.1.04 కోట్ల షేర్, రూ.1.85 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యింది. ఇక ఈ సినిమా రెండో రోజు రూ.2 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టినట్లు.. ప్రముఖ సంస్థ సాక్‌నిల్క్ నివేదికలో పేర్కొంది. అంటే ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.4 కోట్లకు పైగా షేర్ సూళ్లను కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది, ఏ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుని మంచి క్రేజక సంపాదించుకోవడంతో.. మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్.. ఆంధ్ర మరియు తెలంగాణలో అదనపు షోలు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.