ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు బడ్జెట్, స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ పై ఆధారపడి రిజల్ట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్తో అత్యంత హంగులతో రిలీజ్ అయిన సినిమాలు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. అంతేకాదు.. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్న చిన్న సినిమాలలో ఇటీవల రిలీజైన లిటిల్ హార్ట్స్ సైతం ఒక టాలీవుడ్ స్టార్ యూట్యూబర్, కమెడియన్ మౌళి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో మౌళి రికార్డులు బ్రేక్ చేశాడు. యూత్ ఆడియన్స్ను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకున్నాడు.
ఇక సెప్టెంబర్ 12న ఈ సినిమాకు పోటీగా తెరకెక్కిన మిరాయ్, కిష్కింధపురి సినిమాలు సూపర్ సక్సెస్తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనూ లిటిల్ హార్ట్స్ పై కాస్త కూడా ఈ మూవీస్ ప్రభావం పడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో కేవలం రూ.3 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందట. అయితే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు 9 రోజుల్లో రూ.20 కోట్ల రూపాయల గ్రాస్ రూ.11 కోట్ల షేర్ రావడం విశేషం. ఇది సాధారణ సక్సెస్ కాదు. ప్రాంతాలవారీగా చూసుకుంటే నైజాం ప్రాంతంలో మాత్రమే ఏకంగా రూ.5 కోట్ల షేర్ సొంతం చేసుకుని.. సీడెడ్లో రూ.97 లక్షలు, ఆంధ్రాలో రూ.5 కోట్లు, ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లు కలుపుకొని రూ.4 కోట్ల 70 లక్షల వరకు షేర్ కలెక్షన్లను దక్కించుకుంది.
ఇలా ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.30 కోట్ల గ్రాస్.. అంటే రూ.15 కోట్ల 60 లక్షల షేర్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సెకండ్ సాటర్డే ఈ సినిమా.. నార్త్ అమెరికాలో 70 వేల డాలర్లను దక్కించుకుందట. చూస్తుంటే నార్త్ అమెరికాలో ఏ సినిమా కచ్చితంగా ఫుల్ రన్ లో వన్ మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా.. భారీ బడ్జెట్ లేకుండా చిన్న హీరోయిన్ల ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తుంటే.. అదే ఓ స్టార్ హీరో సరైన కంటెంట్ ఎంచుకొని సినిమా తెరకెక్కిస్తే ఏ రేంజ్లో కలెక్షన్లు కల్లగొడతాయో ఊహకు కూడా అందదంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.