బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్లు కల్కి 2 నుంచి దీపికను తప్పిస్తున్నామని.. ఎప్పుడైతే అఫీషియల్ గా వెల్లడించారో అప్పటి నుంచి నెగిటివ్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు గతంలో స్పిరిట్ సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డివంగా ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అటు సందీప్ రెడ్డివంగా, అలాగే కల్కి 2 నుంచి తప్పించడం.. రెండింటిని ముడిపెడుతూ.. దీపిక పదకొండును నెగటివ్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు నేటిజన్స్. ఈ రెండు సినిమాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమే దీపికా అని.. తన దగ్గరే తప్పంతా ఉందని డైరెక్ట్ గానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అసలు మేటర్ ఏంటంటే.. దీపిక కల్కి 2 లో నటించడం లేదని.. వైజయంతి మేకర్స్ ఆఫీసులకు ప్రకటించడంతో పాటు.. ఆమెకు ఈ ప్రాజెక్ట్ పట్ల నిబద్ధత లేకపోవడం కారణమంటూ వివరించారు. అంతేకాదు.. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జున కూడా దీనిపై ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అవుతూ జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు. కానీ.. తర్వాత ఏం జరగాలో మీరే ఎంచుకోవచ్చు అంటూ ఓ పోస్ట్‌లో రాసుకోచ్చాడు. ఇక దీపికను ఉద్దేశించే నాగ్ అశ్విన్ ఇలాంటి కామెంట్స్ చేశారని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో.. దీపిక దీనిపై కచ్చితంగా రియాక్ట్ అవుతుందని కల్కి 2 వివాదంపై ఆమె ఎలా స్పందించెనుందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో మొదలైంది. ఇలాంటి క్రమంలో తాజాగా దీపిక పదుకొనే తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ.. అందరికీ సడన్ ట్విస్ట్ ఇచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో కలిసి తను మరో సినిమా చేయడం గురించి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే షారుక్ నేర్పిన పాఠం గురించి ప్రస్తావిస్తూ.. కల్కి 2 టీంకు ఇన్ డైరెక్ట్ కౌంటర్లు వేసిందట. ఇంతకీ ఆమె పోస్ట్‌లో ఏం రాసుకొచ్చిందంటే.. 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం.. సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్ కొన్ని పాఠాలు నేర్పారని వివరించింది. మనం సినిమా నుంచి ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో మనం పని చేస్తున్నాం అనేది ముందుగా తెలుసుకోవాలని.. సినిమా సక్సెస్ కంటే మనం ఎవరితో సినిమా చేస్తున్నామనే విషయమే ముఖ్యమని.. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటూ షారుక్ నాతో చెప్పారు. అప్పటినుంచి నేను ఆ మాటలని గట్టిగా నమ్ముతా.. అందుకే ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఆ పాఠాన్ని అమలు చేస్తున్న అంటూ దీపిక వివరించింది. మొత్తానికి షారుక్‌ను అడ్డం పెట్టుకొని దీపికా ఈ పోస్ట్ ఇన్ డైరెక్ట్ గా కల్కి 2 గురించే చేసిందని అభిప్రాయాలు నెటింట వ్యక్తం అవుతున్నాయి.