అప్పుడే ఓటీటీలో ‘ కిష్కింధపురి ‘ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్ల‌ర్ కిష్కింధ‌పురి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి ఫామ్‌లో థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయిన క్రమంలో.. కాస్త కలెక్షన్లపై ప్రభావం పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్‌ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా బాగుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్లాప్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ.. సెకండ్ డే నుంచి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయి. మెల్లమెల్లగా మంచి వసూళ్లను దక్కించుకుంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే లోపు సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశం ఉందని చెప్తున్నారు.

చాలాకాలం గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఓ సూపర్ హిట్ పడనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఏదైనా బుల్లితెరపై కంటే థియేటర్‌లో చూస్తేనే అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ.. ఇటీవల కాలంలో ఓటీటీలకు అలవాటు పడిన జనం దీన్ని కూడా ఓటీటీలో చూడవచ్చులే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు. చిన్న చిన్న సినిమాలు బాగున్నా చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఆడియన్స్‌కు ఈ సినిమా నుంచి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది. బెల్లంకొండ గత సినిమా భైరవం సినిమా కూడా ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వాళ్లతో మేకర్స్‌ చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాని నాలుగు వారాలు తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది.

Bellamkonda Sreenivas-Anupama Parameswaran's thriller titled Kishkindapuri

అంటే వచ్చే నెల 12న ఈ సినిమా జి 5 యాప్‌లో మనం చూసేయొచ్చట. ఇది నిజంగానే చాలామంది వ్యూవ‌ర్స్‌కు గుడ్ న్యూస్. అయితే.. ఎప్పటికి థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ సైతం మళ్లీ ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా చూపుతారా.. లేదా.. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుందో అనే ఆసక్తి మొదలైంది. అయితే.. ఇప్పటికే థియేటర్‌లో సినిమా చూసిన ఆడియన్స్‌ కచ్చితంగా ఈ సినిమాను థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని చూస్తే ఆ ఫీల్ ను అస్సలు పొందలేరట. ఇక ఇటీవల కాలంలో సినిమాల్లో ఎక్కువ అవుతున్న కుళ్ళు కామెడీ ఈ సినిమాలో అసలు కనిపించద‌ని.. వచ్చే హారర్ థ్రిల్లర్ సీన్స్ అయితే మనలో సీట్ ఎడ్జ్‌కు తీసుకు వస్తాయని.. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్‌ చెప్తున్నారు. కొన్ని టికెట్లు కచ్చితంగా న్యాయం చేసే సినిమా ఇది అని బెల్లంకొండకు కచ్చితంగా ఈ సినిమాతో మంచి సక్సెస్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.