ఒక్కసారి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎలా టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ బ్యూటీ పేరు తెగ వైరల్ గా మారుతుంది. నిన్న మొన్నటి వరకు వరుస అట్టర్ ప్లాప్స్ తో పే డౌట్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన ఒకే ఒక్క సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించినా సినిమా రూ.100 కోట్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అమ్మడి పేరు తెగ ట్రేండింగ్‌గా మారింది. ఇంతకీ మె ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? ఒకసారి తెలుసుకుందాం.
ఆమె మరెవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన లోకా చాప్టర్ వన్ చంద్ర సినిమాతో అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇందులో అమ్మడినటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కళ్యాణి ప్రియదర్శన్.. మొదట సినీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి చాలామందికి తెలియదు. ఆమె డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె. 1993 ఏప్రిల్ 5న చెన్నైలో జన్మించిన ఈ అమ్మడు.. లేడీ అండ్ స్కూల్లో తను చదవుని పూర్తి చేసింది. హృతిక్ రోషన్ క్రిష్ 3 సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను ప్రారంభించింది.
మానాడుతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. హలో సినిమా తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. ఇక ఇప్పుడు.. లోకా సినిమాతో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి డొమెనిక్ అరుణ్ దర్శకుడుగా వ్యవహరించారు. కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు.. నజ్లీన్, శాండీ, సంతు, సలీం కుమార్, అరుణ్ కొరియాన్ కీలక పాత్రల్లో మెరిసారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్స్ చేయకున్నా ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్లపైగా వసూళ్లను దక్కించుకుంది. దెబ్బతో అమ్మడు పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మహిళా ప్రధాన పాత్రలో నటించి మొట్టమొదటిసారి రూ.100 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇదేనంటూ.. ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ కళ్యాణి ప్రియదర్శన్ అంటూ ఫ్యాన్స్ ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు.