హీరోయిన్ ఆశా సైని.. పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఆ ఇంట్లో మూవీ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఇక ఈ అమ్మడి అసలు పేరు ఫ్లోరా సైని. 1999లో ప్రేమ కోసం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు రిలీజ్ టైం లో నిర్మాత చెప్పకుండానే పేరును ఆశా సైనిగా మార్చేసాడు. అప్పటి నుంచి అదే పేరుతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. నువ్వు నాకు నచ్చావు, నరసింహనాయుడు, ప్రేమతో రా, మైకల్ మదన కామరాజు లాంటి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆశా.. లక్స్ పాపా సాంగ్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమిళ్, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ తిరుగులేని పాపులారిటీ సొంతం చేస్తుంది. రానా నాయుడు, దట్ ట్రయల్ వెబ్ సిరీస్‌లోను నటించింది.
ఇక సినిమాలో ఆఫర్లు దక్కించుకుంటూ.. సెలబ్రిటీగా మారిన వాళ్లు లగ్జరీ లైఫ్ గడుపుతారని.. పూల పాన్పుపై నిద్రిస్తారని అంతా భావిస్తారు. కానీ.. వాళ్ళు లైఫ్ లోను విషాదాలు, వెండితెరపై కనిపించని కష్టాలు ఎన్నో ఉంటాయి. ఈ అమ్మడి లైఫ్ కూడా అలాంటిదే. అందరిలానే ఆశ సైని కూడా ప్రేమలో పడింది. ఎంతగానో ప్రేమించిన వాడే ఈమెకు నరకాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో తనపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోస్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఈ ఘటన తర్వాత ప్రేమపై నమ్మకాన్ని కోల్పోయిన ఆశ.. అమ్మ, నాన్నని ప్రపంచంగా భావించి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకీ అసలు మేటర్ ఏంటో చెప్పలేదు కదా.. 20 ఏళ్ల వయసులో నిర్మాతతో ప్రేమలో పడిన ఈ అమ్మడు.. అప్పటికే పలు బ్రాండ్స్‌కు మోడల్గా పనిచేయడమే కాదు.. దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించింది. కానీ.. ఈ అమ్మడు కెరీర్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ నిర్మాతను ప్రేమించడమే. అతనితో ప్రేమలో పడిన కొద్ది రోజులకే.. లైఫ్ తారుమారయింది. అతడు ఆమెను వేధింపులకు గురిచేయడం.. ఫోన్ లాక్కుని సినిమాల్లో నటించవద్దని పోస్ట్ చేయడం.. ఏడాదిన్నర పాటు ఎవ్వరితోనూ మాట్లాడినివ్వకపోవడం.. ముఖం అలాగే ప్రైవేట్ భాగాలపై దారుణంగా గాయపరచడం అలా తీవ్రంగా టార్చర్ చేశాడట. ఈ విషయాని.. క్లోరోసైని స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఒకరోజు పొట్టపై తండడంతో నొప్పి బాధ భరించలేకపోయాను అని వివరించింది. అంతేకాదు.. తిరిగి మామూలు మనిషిని అవ్వడానికి నెలలు గడిచింది అంటూ వివరించింది. ఇక తాజాగా బిగ్ బాస్ రియలిటీ షో ఎంట్రీతో అమ్మడి బ్యాక్ గ్రౌండ్ తెగ వైరల్ గా మారుతుంది.