HBD పవన్ కళ్యాణ్: కెమెరా అంటే భయపడే పవన్.. పవర్ స్టార్ గా, పొలిటికల్ లీడర్ గా ఎదిగిన తీరు మైండ్ బ్లోయింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. మొదటిలో సినిమాలో హీరోగా నటించడం పెద్దగా ఇష్టం లేని పవన్.. కెమెరా ముందు నిలబడాలన్న‌, నలుగురు ముందు గట్టిగా డైలాగ్ లు చెప్పాలన్న చాలా మొహమాట పడేవారు. ఆయన మొదటి నుంచి సిగ్గరి అన్న సంగతి స్వయంగా తానే చాలా సందర్భాల్లో వివరించాడు. డైరెక్షన్, ఇతర విభాగాల్లోనే తాను ఆసక్తి చూపే వాడనని.. వదిన సురేఖ చలవ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చానని.. కచ్చితంగా సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని బలవంతం చేసి మరీ నన్ను ఇలా ఇండస్ట్రీలోకి తోసేసిందని.. ఇప్పుడు మీ ముందు ఇలా పవర్ స్టార్ గా నిలవడానికి ఆమె కారణం అంటూ ఎన్నోసార్లు వివరించాడు.

Akkada Ammayi Ikkada Abbayi - Wikiwand

ఇక పవన్ ఎంట్రీ కంటే ముందే చిరు పెద్ద తమ్ముడు నాగబాబు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే పవన్ పై కూడా ఆడియన్స్ లో పెద్ద అంచనాలు ఉండేవి కావు. కానీ.. ఆయన సినీ ప్రస్థానం చాలా వినూత్నంగా మొదలైంది. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. మూవీ సెట్స్ పైకి వచ్చిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్స్‌ని గోడలపై అంటించారు. కానీ.. ఎక్కడ పవన్ ఫేస్ ను రివిల్ చేయకుండా.. ఎవరి అబ్బాయి అనే హైప్‌ సినిమాపై కలిగేలా చేశారు. చాలాకాలం గ్యాప్ తర్వాత.. భారీ సెట్స్‌లో చిరు రెండవ తమ్ముడు అనే విషయాన్ని జనాలకు రివీల్‌ చేశారు. అలా సినిమాపై ఓ మాదిరి హైప్‌ కలిగింది. ఇక చిరు రంగంలోకి దిగి సినిమా ప్రమోషన్‌లో సందడి చేశారు.

ఈ క్రమంలో సినిమాపై భారీ హైట్ మొదలైపోయింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకోలేక డీలపడింది. అలా మొదలైన ఆయన సినీ కెరీర్.. గోకులంలో సీత, సుస్వాగతం లాంటి సక్సెస్ లతో నెమ్మదిగా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్ప‌టివ‌ర‌కు చిరంజీవి తమ్ముడు గానే ఇండస్ట్రీలో రాణించిన పవన్.. తొలిప్రేమ మూవీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్లు చూశాడు. మెగాస్టార్‌ను మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అప్ప‌టివ‌ర‌కు వరుస బ్లాక్ పాస్టర్లు అందుకున్న ఆయన కెరీర్‌ ఖుషి సినిమా తర్వాత మెల్లగా నెమ్మదించింది. జారీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఘోర డిజాస్టర్ గా నిలిచింది.

Pawan Kalyan Movies List

ఈ సినిమాతో పవన్ తనని తాను దర్శకుడుగా జనాలకు పరిచయం చేసుకున్నాడు. లేటెస్ట్ టెక్నాలజీతో.. ఫుల్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ఆడియోస్ కు పరిచయం చేశాడు. లవ్ స్టోరీ, ఫ్యాక్షన్, మాస్ మసాలా సినిమాలు ట్రెండ్ గా మారిన ఆ రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత గుడుంబా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్‌. స్వయంగా తానే స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించినా.. ఊహించిన రేంజ్ లో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన బాలు యావరేజ్ టాక్.

ఇక తర్వాత బంగారం, అన్నవరం సినిమాలో యావరేజ్ టాక్. ఆ తర్వాత రిలీజ్ అయిన జల్సా మాత్రం పెను ప్రభంజనం సృష్టించింది. ఓ రకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో చిన్న తప్పులను సరిదిద్దువు ఉంటే అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్గా నిలిచేది. ఇక తర్వాతే పవన్ కెరీర్‌లో అసలు సిసలు టఫ్ డేస్ మొదలయ్యాయి. కొమరం పులి, తీన్మార్, పంజా ఇలా వరుసగా డిజాస్టర్లను ఎదుర్కొన్న పవన్.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటాడని అంతా భావించారు. సరైన సమయానికి హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన గబ్బర్ సింగ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చేలా చేసింది.

Watch Gabbar singh (Telugu) Full Movie Online | Sun NXT

బ్లాక్ బస్టర్గా నిలిచి కోట్ల కలెక్షన్లు కల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత.. అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రియల్ హిట్. ఈ సినిమాతో పవన్ ఒక్కసారిగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు. అప్పటివరకు కేవలం సినిమాల పైన పూర్తి ఫోకస్ ఉంచిన పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎంతో పట్టుదల, కసితో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సినిమా కథలో ఎంపిక విషయంలో ఫోకస్ తగ్గింది. అలా.. మరోసారి సర్దార్ గబ్బర్ సింగ్, కాటంరాయుడు, అజ్ఞాతవాసి లాంటి వరుస ప్లాప్లను ఎదుర్కొన్నాడు. ఇక రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ప్రజలను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే మొదటిసారి ఎలక్షన్స్లో ఘోరమైన ఓటమిని చూశారు. అయినా పవన్ ఎక్కడ తలవంచలేదు.

ఇక సినిమాల విషయానికొస్తే మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ పాస్టర్ సక్సెస్ దక్కించుకున్నాడు. కరోనా పీక రేంజ్ లో ఉన్న టైంలో రిలీజ్ అయినా కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన బీమ్లా నాయక్ కూడా మంచి సక్సెస్ అయింది. కానీ.. అప్పట్లో పవన్ అపొనెంట్ వైయస్ జగన్.. సీఎం గా ఉండడంతో టికెట్ రేట్లు అసలు పెంచకుండా.. మరింత తగ్గించి ఆయనను ఇబ్బంది పెట్టాడు. దీంతో భారీ వసూలను సినిమా అందుకోలేకపోయింది. లేదంటే ఈ సినిమా నాన్న బాహుబలి ఇండస్ట్రియల్ హిట్ అయి ఉండేది అనడంలో అతిశ‌యెక్తి లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన బ్రో కమర్షియల్ గా ఫ్లాప్. ఇక అప్పటికే పొలిటికల్ మీటింగ్లో ఫుల్ బిజీ అయిపోయిన పవన్.. ఎంతో మందిని త‌న‌వైపు తిప్పుకున్నాడు.

Watch Vakeel Saab | Prime Video

ఖచ్చితంగా ఈసారి పవన్ సక్సెస్ అవుతారని అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా మాట్లాడుకునే రేంజ్ లో తానేంటో జనానికి పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నెగ్గి పగ్గాలు చేపట్టాడు. ఇక ఓ పక్కన పాలిటిక్స్ లో బిజీ బిజీగా రానిస్తూనే మరో పక్క సినిమాల్లోనూ చేస్తున్నాడు. అలా డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత.. పవన్ హరిహర వీరమల్లు సినిమాలో నటించి ఆడియ‌న్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా ఈ నెల 25న మరోసారి ఓజి సినిమాతో రానున్నాడు పవన్. అయితే.. సినిమాపై ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు మొదలయ్యాయి. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమై.. సినిమా భారీ బుకింగ్స్‌ని ద‌క్కించుకొని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.