టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్నో ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు సరికదా.. ఏ సినిమాకు సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ తెరకెక్కనుందని గతంలో వార్తలు వినిపించిన తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. కాగా.. సైలెంట్‌గా ఉంటున్న ప్రశాంత్ వర్మ.. ఈ గ్యాప్‌లో ప్రభాస్ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేసుకున్నాడట. ప్రతి క్యారెక్టర్, సీన్.. షాట్.. ముందే ప్రీ విజువలైజేషన్ తో డిజైన్ చేసి సిద్ధం చేశాడట.
ఇక ఆ విజువలైజేషన్ ద్వారా వేగంగా షూట్ కంప్లీట్ చెయ్యొచ్చు అనే రేంజ్‌లో ఫుల్ క్లారిటీగా ఈ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసినట్లు వెల్లడించాడు. ఇక సినిమా షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. బ్రహ్మ రాక్షస అనే వర్కింగ్ టైటిల్‌తో పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం.. మొదట రణ్‌బీర్ కపూర్‌ను అనుకున్నా.. తర్వాత ఇదే స్టోరీ.. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మార్చి ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నట్లు సమాచారం. రిలీజ్ సమయానికి టైటిల్ మార్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.