ప్రభాస్ చేతుల మీదుగా ” ఘాటి ” రిలీజ్ గ్లింప్స్.. అదుర్స్(వీడియో)..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఘాటీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై అమ్మడు మెర‌వ‌నుంది. సెప్టెంబర్ 25న అంటే రేపు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో.. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభించేసారు. ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో చాలా చోట్ల టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల‌తో పాటు.. సింగల్ స్క్రీన్ ధియేటర్లలోను సినిమా సందడి కనిపిస్తుంది. అరుంధతి, భాగమతి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాల తర్వాత.. అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమా కావడంతో ఆడియన్స్‌లో ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకు మరింత హైలెట్ ప్రభాస్ తాజాగా లాంచ్ చేసిన రిలీజ్ గ్లింప్స్.

Prabhas Launches Ghaati Glimpse: Anushka Shetty's Power-Packed Action Ride - TeluguBulletin.com

ఫుల్ ఆన్‌ యాక్షన్ మోడ్‌లో ఈ టీజర్ కట్ అదిరిపోయింది. క్రిష్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్‌లో యాక్షన్ గ్లింప్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. అనుష్క యాక్ష‌న్ సీన్స్‌లో దుమ్ము దులిపేసింది. క్రిష్ చెప్పినట్లు విశ్వరూపాన్ని చూపించిందని చెప్పాలి. ఇక మ్యూజిక్ ఆ గ్లింప్స్‌ను మ‌రో లెవల్‌కు తీసుకు వెళ్ళింది. విజువల్స్ ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి బిజియం అదిరిపోయింది. ఇక మూవీ రిలీజై ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.