ఆ విషయంలో తొందర పడ్డా.. అది నిజమైన ప్రేమ కాదని ఎవరు చెప్పలేదు.. సమంత ఎమోషనల్

స్టార్ హీరోయిన్‌గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. కేవలం టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల్లో తన సత్తా చాటుకుంది. బాలీవుడ్ లోనూ పలు వెబ్‌సిరీస్‌ల‌ ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడు సినీ కెరీర్‌లో సక్సెస్ సాధించిన రేంజ్‌లో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయింది. ఆమె అనుకున్నట్లుగా లైఫ్ లో ఏది జరగలేదు. సమంత గతం అందరికీ తెలిసిన పుస్తకమే. 2015 నుంచి ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తూ ప్రేమించుకున్న.. సమంత, నాగచైతన్య 2017 అక్టోబర్ 4న‌ గోవాలో గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరికీ మంచి ట్రీట్‌ ఇచ్చారు.

ఇక చాలాకాలం వరకు మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా ఉన్న‌ వీళ్ళిద్దరూ.. అనుకోన్ని కారణాలతో డివోర్స్ తీసుకున్నారు. ఇక తర్వాత సమంత ఇండస్ట్రీకి చాలా కాలమే దూరమైంది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సినిమాల్లో మాత్రం నటించడం లేదు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి.. ఒకటి, రెండు సినిమాలను చేస్తుంది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం సమంత ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. అలా.. రీసెంట్గా 20, 30 వయసులో తన అనుభవాలు, ప్రేమ , జీవన పాటలు ఇప్పటి లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చింది.

నిన్న.. రమ్య మేకప్ ఆర్టిస్ట్‌.. మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. నన్ను అవి ఆలోచింపచేసాయని.. 30ల తర్వాత అంతా డౌన్ మాత్రమే అంటూ ప్రపంచమే చెబుతుంది. మీ షైన్ మసకభారీ పోతుంది, మీ అందం చేజారిపోతుంది, ఇక నేను ఫుల్ ఫీల్ లైఫ్, ఫుల్ ఫీల్ బాడీ, ఫుల్ ఫుల్ ఫేస్ కోసం 20లో రెస్ట్ లేకుండా పరిగెత్త. తొందరపడుతూ గడిపేసా. ఎక్కువగా కనపడడానికి.. తగినంత ఫీల్ కావడానికి కూడా సమయం తీసుకోకుండా తొందరపడ్డా. కానీ.. నేను దానివల్లే లోపల ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటో ఎవరు చెప్పలేదు. ప్రజెంట్ నేను మొత్తం మారిపోయా. పరిగెత్తడం ఆపేసి లైఫ్ లో ప్రశాంతంగా లీడ్ చేస్తున్నానంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.