బిగ్ బాస్ 9: హౌస్ లో సృష్టి వర్మ ఎంట్రీ.. త్వరగా బయటికోచ్చేయ్ అంటూ నాగార్జున షాక్..!

బిగ్ బాస్ సీజన్ 9 గేమ్ స్టార్ట్ అయింది. (సెప్టెంబర్ 7) నిన్న.. ఈ ఈవెంట్ గ్రాండ్‌గా లాంచ్ చేసాడు నాగార్జున. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి సెన్సేషన్‌గా మారిన యంగ్ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక చాలామంది ముద్దుగుమ్మల్లా గ్లామర్ పెర్ఫార్మన్స్ తో కాకుండా.. పద్ధతిగా లంగా ఓణితో తళ్ళుక్కున మెరిసింది సృష్టి వర్మ. ఇక తర్వాత తన పాటకు ఒక మంచి పర్ఫామెన్స్ ఇవ్వమని నాగార్జున కోరడంతో.. కన్నెపెటరో కన్నుకొట్టరో సాంగ్కు స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.

Shrasti Verma - Photos, Videos, Birthday, Latest News, Height In Feet -  FilmiBeat

బిగ్ బాస్ హౌస్ కి రావాలని ఎందుకు అనుకున్నావు అని నాగ్‌ ప్రశ్నించడంతో మోటివేషనల్ స్పిచ్ ఇచ్చింది. ఈ హౌస్ లో ఎంత ట్రై చేసినా మాస్క్ నెట్టుకుని ఎవ‌రూ ఉండలేరు. ఎప్పటికైనా బయటపడి పోవాల్సిందే. అందుకే నేను ఇక్కడికి రావాలనుకున్న అంటూ వివరించింది. ఇక జీవితంలో కఠిన పరిస్థితి వస్తే మనలో ధైర్యం బయటకు వచ్చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లు బయటి వాళ్లు ఏమనుకుంటున్నారు అనేది అసలు పట్టించుకోకూడదని నేను అసలు పట్టించుకోను అంటూ వివరించింది.

Shrasti Verma in Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్  శ్రష్ఠి వర్మ.. ఈసారి మాములుగా ఉండదుగా!

తర్వాత సృష్టి డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఫిదా అయినా నాగార్జున.. జాక్పాట్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు త్వ‌ర‌గా ఆలోచించి బయటికి వచ్చేస్తే మనిద్దరం కలిసి పనిచేద్దామంటూ నాగార్జున వివరించాడు. ఇంకా హౌస్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వకముందే బయటకు వచ్చేయమని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం అందరికీ షాక్‌ కలిగిస్తున్నాయి. ఇక నాగ్ ఇచ్చిన జాక్‌పాట్ ఆఫర్ సృష్టి కొట్టేస్తుందా లేదా చూడాలి.