టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీ.జీ.విశ్వప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు తీసుకురానట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోనే టీజర్ సైతం రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు.
అయితే.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా టీం ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చినా చాలంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజాగా.. సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ది రాజాసాబ్ ట్రైలర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నారని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన నిధీ అగర్వాల్, మాళవిక మోహన్ , రెద్ది కుమార్ హీరోయిన్‌గా మెరవనున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్త్ విలన్ పాత్రలో కనిపించాడు. సప్తగిరి, విటీవీ గణేష్, ప్రభాస్ సీనుతో పాటు.. తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే చాలు.. అంచనాలు ఆకాశానికి అందుతాయి అనడంలో సందేహం లేదు. ఇక డైరెక్టర్ మారుతి ప్రభాస్‌కు సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తాడు.. ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.