టాలీవుడ్ లో ఒకప్పుడు పలు సినిమాల్లో కమీడియన్‌గా.. తర్వాత ప్రొడ్యూసర్ గా భారీ ఇమేజ్ సంపాదించుకున్న బండ్ల గణేష్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా సిపిమాలకు దూరంగా ఉంటున్నఆయన తాజాగా.. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన ఆ వివాదాస్పద కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బండ్ల గణేష్ స్టేజ్‌పై మాట్లాడుతూ ఇలాంటి సినిమా చేసిన మౌళి నికు ఓ మాట చెప్తున్న. ఈ 20 రోజులు జరిగింది మొత్తం ఒక్క ఫేక్.. ఒక్క మాయ మాత్రమే. ఒక 3d అనుకో. కళ్ళజోడు తీయి సినిమా రిలీజ్ రోజున నువ్వు ఉన్న స్టేటస్ పైనే నిలబడు.
నాలాంటోడు నీ దగ్గరికి ఒకడు వస్తాడు. మౌళి గారు మీరు ఆరడుగుల పడవున్నారు.. మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు కూడా సరిపోరని చెప్తాడు. అవన్నీ అసలు నమ్మకు. నువ్వు ది గ్రేట్ లెజెండ్ చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలి అని కోరుకుంటున్నాను. నేను రోజు ఇంటికి వెళ్ళగానే షాద్ నగర్లో ఉండే నా కోళ్ల ఫామ్ గుర్తు చేసుకుంటా. నువ్వు అలా నీ మూలాలు మర్చిపోకు. లేదంటే.. వీళ్ళు ఇక్కడ నిన్ను బ్రతకనివ్వరు. ఇదంతా మాఫియా. ఈ మాఫియాని తట్టుకొని నిలబడడలంటే మనం బేస్ మీద నిలబడి ఉండడం చాలా ముఖ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మెగాస్టార్ చిరుతో ఒక్క ఇయర్ గ్యాప్ వచ్చింది.. అదే టైంలో శ్రీకాంత్ హీరోగా పెట్టి పెళ్లి సందడి సినిమా తీశాడు అల్లు అరవింద్ గారు.
ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్లో శ్రీకాంత్ ఎక్కడికో వెళ్లిపోయాడు అంటూ వివరించాడు. ఆ తర్వాత ఆయనకు వరుస ప్లాప్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటోళ్లు కోటికో నూటీకో ఒకరు పుడతారు. వాళ్లని ఎవరో టచ్ కూడా చేయలేరు. నువ్వు మంచి యాక్టర్‌వి. అలాగే కొనసాగాలంటూ కోరుకుంటున్న. కనుక పొగడ్తలు అసలు పట్టించుకోకంటూ వివరించారు. విజయ్ దేవరకొండ టీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్విట్ చేశాడు.. బండ్ల గణేష్ అది చేశాడు.. ఇలాంటివన్నీ కేవలం అబద్ధాలు. ఇవన్నీ నీకు ఆశీర్వాదాలు మాత్రమే అనుకో. మరో వారం ఇంకొక మౌళి.. ఇంకో శుక్రవారం ఇంకోడు వస్తాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉండు.. ఎవర్ని నమ్మకు.. కేవలం నమ్మినట్లు నటించు అంతే.. అల్లు అర్జున్ లాగా కష్టాన్ని, టాలెంట్ ని నమ్ముకొని బతకాలి. ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటూ బండ్ల గణేష్ వివరించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.