బన్నీపై అవార్డుల వర్షం.. ‘ పుష్ప ‘ గాడి రూలింగ్ ఇది..!

ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకల్లో పుష్పా రాజ్‌ మానియా కొనసాగుతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలోనే.. పుష్ప 2 సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకున్నాడు బన్నీ. సైమా నుంచి ఇప్పటివరకు ఆయనకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అవార్డ్స్ దక్కాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, అలవైకుంఠపురం లో, పుష్ప.. ఇలా వరుసగా సైమా అవార్డులను దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక కొద్ది రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన గ‌మా అవార్డ్స్ 2025 లోను ఆయనకు మరో అవార్డ్ దక్కింది. గామా నుంచి బెస్ట్ యాక్టర్ ఆఫ్ పుష్ప 2 అవార్డ్‌ను అందుకున్నాడు బ‌న్నీ.

Allu Arjun channels inner Pushpa after winning Best Actor Award at SIIMA  2022, says THIS about the film - India Today

అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గద్దర్ అవార్డ్స్ 2025 లోను అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకున్నాడు. ఇది మొట్టమొదటి గద్దర్.. ఉత్తమ నటుడు అవార్డు కావడం విశేషం. ఇక ఇప్పటివరకు తన కెరీర్లో 20 కి పైగా సినిమాల్లో నటించిన బన్నీ.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. ఈ అవార్డులన్నీ ఇవన్నీ ప్రతిభకు నిదర్శనం అనడంలో సందేహం లేదు. అయితే.. సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2కు అవార్డుల వర్షం కురుస్తుంది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కే కాదు.. బెస్ట్ ఫిమేల్ లీడ్‌గా రష్మిక మందన్న, బెస్ట్ డైరెక్టర్గా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ సింగర్ గా శంకర్ బాబు కందుకూరిలకు వరుసగా అవార్డులు దక్కాయి.

Allu Arjun receives Gaddar Award for Pushpa 2 from CM Revanth after run-in  over stampede case, fans love the 'comeback' - Hindustan Times

ఇలా ఒక్క సినిమా కోసం ఏకంగా 5 అవార్డులు దక్కించుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. కాగా.. దాదాపు ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సినిమా కలెక్షన్లతో పాటు.. అవార్డ్‌ల‌, రికార్డుల పాత మోగిస్తున్నాడు బన్నీ. పుష్పగాడి రూల్ అంటే ఇది అనే రేంజ్ లో ఆయన తన సత్తా చాటుకుంటున్నాడు. కేవలం నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందేలా అల్లు అర్జున్ అవార్డులు దక్కించుకోవడం.. ఆయన గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా లెవెల్ ను కూడా దేశవ్యాప్తంగా చాటి చెప్పడం అనడంలో సందేహం లేదు.