టాలీవుడ్ పవర్ స్టార్ గత సినిమా హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రూపోందుతుంది. ఇక ఇప్పటికే వీరమల్లు పార్ట్ 1 జులై 24న గ్రాండ్ గా రిలీజై భారీ అంచనాలతో ఆడియన్స్‌ను పలకరించింది. అయితే.. సినిమా ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. కాక మొదటి సినిమాకు దర్శకుడుగా క్రిష్ వ్యవహరించగా.. తర్వాత అనూహ్యంగా జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళింది. అయితే అనుష్క నటించిన ఘాటి సినిమా ప్రమోషన్స్‌లో క్రిష్ మాట్లాడుతూ వీరమల్లు పార్ట్ 2పై కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు.వీరమల్లులో నేను చాలా వరకు సీన్స్ ఢిల్లీ దర్బార్‌లో షూట్ చేశానని.. ఆ సీన్స్ భారీ లెవెల్లో రావాలని అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెషల్ సెట్స్ వేసి మరీ తీసామని.. కరెంట్ బల్బ్ పై పవన్ చేసే ఫైట్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంటాయి. కానీ.. ఇదంతా స్టోరీ ఢిల్లీకి మారినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సుమారు 45 నిమిషాల ఫుటేజ్ అద్భుతంగా షూట్ చేసాం. అయితే.. ఈ ఫుటేజ్ అంతా సెకండ్ పార్ట్ కోసం రెడీగా ఉంచాం అంటూ క్రిష్ వివరించాడు.
అంతేకాదు.. పార్ట్ 2లో పవన్ మెస్వరైజింగ్ స్టంట్స్ చేస్తాడని.. వీరమల్లు.. ఔరంగాజేబు కోర్టుకు వెళ్లి మొగల్ సామ్రాజ్యంలో ప్రత్యేకంగా రూపొందించబడిన సింహాసనం పై నిలబడి అతనికి సవాలు విసిరి.. కోహినూరు వజ్రాన్ని ఎత్తుకు వచ్చే సీన్స్.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తాయని.. జనాలు ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన సీన్ అప్పుడు చూడవచ్చంటూ క్రిష్ వివరించాడు. ఇప్పుడు క్రిష్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. కాగా.. వీరమల్లు డైరెక్షన్ బాధ్యతలు జ్యోతి కృష్ణ చేతికి వెళ్లిన తర్వాత.. ఫస్ట్ పార్ట్ లో డైరెక్టర్ క్రిష్ మార్క్ ఎలిమెంట్స్ అన్ని మిస్ అయ్యాయని క్లియర్ గా అర్థమవుతుంది. అయితే.. ఈ లోటును సెకండ్ హాఫ్ లో భర్తీ చేయనున్నట్లు కృష్ చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు కంప్లీట్ అయి.. ఆడియన్స్‌ను పలకరిస్తుందో చూడాలి.