చిరు, బాలయ్యకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన స్టార్ బ్యూటీ.. ఎవరంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ఇద్దరు హీరోలతో.. ఒక హీరోయిన్ ఒకే సినిమాలో తల్లిగా భార్యగా మెరిసిందన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్క‌డ స‌క్స‌స్ ఫుల్‌గా దూసుకుపోవాలంటే.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు చేయడానికి అయినా నటీనటులు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి క్రమంలోనే పలు సందర్భాల్లో ఓకే హీరోకు.. హీరోయిన్ తల్లిగా, భార్య‌గా నటించిన సందర్భాలు కూడా వస్తాయి.

Chennakesava Reddy Telugu Movie Review Balakrishna Shriya Saran

వారు చేసే పాత్రలు కూడా ఆడియన్స్‌కు విచిత్రమైన ఫీల్ కల్పించినా.. పాత్ర‌ డిమాండ్ మేర‌కుచేయాల్సి వస్తుంది. అలా కొన్ని సందర్భాల్లో ఒకే హీరోయిన్ ఇద్దరు హీరోలకు తల్లిగా, భార్య‌గా నటించిన సందర్భాలు ఉంటాయి. అలా.. గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఒకే హీరోయిన్.. ఒక సినిమాలో తల్లిగా, భార్యగా మెరిసే ఆకట్టుకుందట. ఎంత‌కి ఆ సినిమాలు ఏంటో.. ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం. ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ టబు. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమాలు బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫ్యాక్షన్ తండ్రి, పోలీస్ కొడుకు పాత్రలో బాలయ్య డబల్ రోల్ లో అదరగొట్టాడు.

Andarivaadu-Tabu | Cinema Chaat

ఇక 2002లో రిలీజ్ అయిన ఈ సినిమాలో టబు సీనియర్ బాలయ్య భార్యగా, జూనియర్ బాలయ్యకు తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రియ శరణ్ మెర‌వ‌గా..వి.వి. వినాయక్‌ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్. చిరంజీవి తోని టబు ఇలాంటి రోల్ ప్లే చేసింది. చిరంజీవితోను ట‌బ్బు.. పలు సినిమాల్లో మెరిసిన సంగతి తెలిసిందే. వాటిలో అందరివాడు కూడా ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రకు భార్యగా, కొడుకు పాత్రకు పిన్నిగా మెప్పించింది. అలా.. ఇప్పటివరకు చిరంజీవి, బాలయ్య ఇద్దరికీ ఒక్క సినిమాలోనే తల్లిగా భార్యగా నటించిన క్రేజీ రికార్డ్ ట‌బ్బు సొంతం చేసుకుంది.