టాలీవుడ్ రౌడీ స్ల్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గత శుక్రవారం గ్రాండ్ లెవెల్లో రిలీజై బాక్స్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సినిమా తెలుగుతోపాటు.. ఇతర భాషల్లోనూ రికార్డు లెవెల్ లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. మొదటి రోజే ఏకంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ మూవీ.. రెండు రోజులకు గాను రూ.53 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక మూడు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.67 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుందని అఫీషియల్ గా మేకర్స్ షేర్ చేసుకున్నారు. ఇక నిన్న వీకెండ్ కారణంగా కింగ్డమ్ వసూళ్లలో మరింత జోరు కనిపించిందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కింగ్డమ్ సక్సెస్ జోరులో విజయ్ దేవరకొండ తో పాటు మూవీ టీమ్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ లైనప్, డైరెక్టర్ల లిస్టు వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఆయన అరడజన్కు పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ లిస్టులో అంత స్టార్ట్ డైరెక్టర్సే అని సమాచారం. ప్రస్తుతం విజయ్ పాపులర్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్నాడు.
గతంలో వీళ్ళ కాంబోలో టాక్సీవాలా వచ్చి మంచి సక్సెస్ అందుకు. దీంతో ఇప్పుడు మరోసారి వాళ్ళ కాంబోపై భారీ హైప్ నెలకొంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రూపొందించనున్నారు. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన్ అనే మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వి. కిరణ్ కొల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అలాగే.. తర్వాత స్టార్ట్ డైరెక్టర్లు సుకుమార్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా విజయ్ సినిమాలు చేయనున్నట్లు సమాచారం. కింగ్డమ్ కు పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని టాక్ వైరల్ గా మారుతుంది. మొత్తానికి ప్రజెంట్ అయితే రౌడీ స్టార్.. స్టార్ డైరెక్టర్ల సినిమాలలో సందడి చేయనున్నాడు.