కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. కొద్ది గంటల క్రితం ఈ మూవీ గ్రాండ్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే టికెట్లు హాట్ కెకుల్లా అమ్ముడుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఇక ఇదే సినిమాకు పోటీగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన వార్ 2 సినిమా సైతం రిలీజ్ అయింది. కాగా.. వార్ 2లో ఎన్టీఆర్ నటించినా టాలీవుడ్‌లో వార్ 2కి పోటాపోటీగా గట్టి పోటీ ఇస్తూ కూలీ దూసుకుపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూలీనే ముందంజలో ఉంది. కూలీ రికార్డుల దరిదాపుల్లో కూడా వార్ 2 లేకపోవడం క్లియర్గా అర్థమవుతుంది. అసలు.. కూలీ సినిమాకు ఎందుకు అంత క్రేజ్.. ఈ సినిమాను కచ్చితంగా ఎందుకు చూడాలి అనే టాప్ ఫైవ్ అంశాలు ఒకసారి చూద్దాం. కూలి సినిమాను కచ్చితంగా చూడడానికి ప్రధాన కారణం రజినీకాంత్ క్రేజ్.. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో మేనియా మొదలవుతుందో తెలిసిందే.
ఇదే కూలి చూడడానికి కూడా ఆడియన్స్‌లో ప్రధాన కారణం. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా కూలి సినిమా చూసేందుకు ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంకో ప్రధాన కారణం సినిమాల్లో ఉన్న స్టార్ కాస్టింగ్.. నాగార్జున, అమీర్ ఖాన్, శృతిహాసన్ లాంటి స్టార్ సెలబ్రిటీ సినిమాలో భాగం అవ్వడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సైతం సినిమా చూడడానికి ఓ ప్రధాన కారణం. ఓ సినిమాకు అనిరుధ్ నుంచి మ్యూజిక్ వస్తుంది అంటే ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన మ్యూజికల్ కంటెంట్ సైతం ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే కూలి సినిమా చూడడానికి కూడా ఆడియన్స్ మక్కువ చూపుతున్నారు. ఇక ఐదో పాయింట్ ఏంటంటే రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్. సినిమా రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి అంటే సినిమాలో కచ్చితంగా కంటెంట్ ఉంటుందని అభిప్రాయం ఆడియన్స్ లో మొదలైంది.