సమంత, నాగచైతన్య విడాకులు దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది. అయినా.. ఇప్పటికి వాళ్ళిద్దరి విడాకులపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లపై అక్కినేని ఫ్యామిలీ కానీ.. ఇటు నాగచైతన్య, సమంత కాని ఎవ్వరూ ఒక్కసారి కూడా స్పందించింది లేదు. కారణమేంటో చెప్పింది లేదు. మొట్టమొదటిసారి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున సిస్టర్ నాగ సుశీల మాట్లాడుతూ.. సమంత – నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా.. ఇంటర్వ్యూలో నాగ సుశీల మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన చర్య అని.. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం కంటే పెళ్లికి ముందే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడం మంచిది అంటూ కామెంట్స్ చేసింది.
అలా అని.. లైఫ్ లాంగ్ బాధపడుతూ బతకడం కూడా కష్టమే. కొన్నిసార్లు విడాకులు తీసుకోవడమే మంచిదంటూ చెప్పుకొచ్చింది. ఇక నాగ సుశీల మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో నాగచైతన్య, సుమంత్ ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలనే వివాహం చేసుకున్నారు. అలా చైతన్య.. సమంత ని పెళ్లి చేసుకుంటే.. సుమంత్.. కీర్తిని వివాహం చేసుకున్నారు. రెండు జంటలు ఒకే రంగానికి చెందిన వారైనా.. మిస్ అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. అలాగే భార్యా,భర్తల గొడవల్లో మూడో వ్యక్తి వస్తే అది మరింత పెద్దదవుతుంది.. కచ్చితంగా వివాదానికి దారితీస్తుంది అంటూ వివరించింది.
అందుకే భార్యాభర్తల గొడవలు మూడో వ్యక్తి దోరకూడదంటూ.. చైతన్య, సమంత ఒకే ఫీల్డ్‌కు సంబంధించిన వాళ్ళైనా.. వీళ్ళ మధ్య సెట్ కాలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సుశీల చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో.. ఇంతకీ సమంత, చైతన్య మధ్యన మూడో వ్యక్తి ఎవరు అంటూ సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. నాగ సుశీల మాటలు కావాలనే.. అక్కినేని ఇంట చిచ్చులు పెట్టినట్లుగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.