టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ.. సక్సెస్‌లు అందుకుంటున్నాడు. విభిన్నమైన స్టోరీ సెలక్షన్లతో ఆడియన్స్ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి రెండు వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని హిట్స్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో హనుమాన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పుడు అదే రేంజ్ పవర్ఫుల్ కంటెంట్‌తో మీరాయ్ సినిమాలో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మైథాలజికల్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ రోల్‌లో మెరవనున్నాడు. తాజాగా.. మీరాయ్ ట్రైలర్ రిలీజ్ చేశారు టీం. అదే రేంజ్‌లో రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని.. ఫైరింగ్ టీజర్ అంటూ బ్లాక్ బాస్టర్ పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే తేజ సజ్జా ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది. కాగా ఈ ట్రైలర్‌లో శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ షాట్స్ చూపించారు.
ఈ క్రమంలోనే.. శ్రీరాముడి పాత్రను చేసింది ఎవరు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. కొంతమంది మాత్రం సినిమాల్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రాముని పాత్రలో మరువనున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ లోలా.. ఆంజనేయుని చూపించి చూపించినట్లుగా మీరాయ్‌లో రామున్ని చూపించి చూపించినట్లు ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. మరి రాముడు పాత్రలో నిజంగా ఏ స్టార్ హీరో నటిస్తున్నాడు.. లేదా ఆర్టిఫిషియల్ ఇంటీలిజెన్స్ తో ఇదంతా క్రియేట్ చేశారా.. అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.