ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముకర్జీ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా.. ఆగష్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. అలా.. తాజాగా హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఏర్పాటు చేశారు. ఈవెంట్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, నాగ వంశీ, త్రివిక్రమ్, దిల్ రాజుతో పాటు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఓ వర్గం ఆడియన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. ముఖ్యంగా.. బాలయ్య ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ఆయనను అవమానించినట్లు ఉన్నాయి అంటూ తెగ బాధ పడిపోతున్నారు.
ఎన్టీఆర్ ను ట్రోల్స్ చేస్తు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఈవెంట్‌లో తారక్.. బాలయ్య గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాడ.. ఎందుకు ఆయనపై ఇంతలా ట్రోలింగ్ జరుగుతుంది.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతు నాపై మా తాత ఎన్టీఆర్ దయ ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరు.. మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో కామెంట్ చేశాడు. అయితే.. ఈవెంట్ లో నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అవుతుందని.. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడలేదు. కేవలం మా తాత, నాన్న మాత్రమే నాకు సపోర్ట్ ఇచ్చారు. నా ఎదుగుదలకు ప్రోత్సహించారు. వాళ్లే నా సక్సెస్ కు కారణమంటూ ఎన్టీఆర్ వివరించాడు. కాగా తారక్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.
2001లో నేను ఇండస్ట్రీలో నిలదీప్పుకోవడానికి కారణం నాన్న, తాతయ్య, బాలయ్య అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ.. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు లేవు.. ఎందుకు బాలయ్య పేరు మర్చిపోయావు.. నీ ఎదుగుదల కోసం బాలయ్య పేరు వాడుకున్న సందర్భాలు ఏమైపోయాయి.. ఇప్పుడు కాస్త ఫేమ్ రావడంతో బాలకృష్ణ పేరును చెప్పడానికి కూడా నచ్చడం లేదా అంటూ తారక్ పై బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తగ్గట్లుగానే కౌంటర్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ కాస్త ఎదిగిన తర్వాతే మా వాడని ఆయనను దగ్గరికి తీసారని.. మొదట్లో తన సొంత టాలెంట్ తోనే తారక్ ఎదిగాడంటూ.. మొదట్లో ఇండస్ట్రీలో ఆయనను తొక్కేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అంటూ.. తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎంత తొక్కాలని ప్రయత్నించినా చివరకు మీరు ఆయన్ని ఏమి చేయలేకపోయారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఎవరి సహాయం తీసుకోకుండా ఆయన ఈ రేంజ్ కు ఎదిగారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.