ఎస్ఎస్ఎంబి 29.. మహేష్ గూస్ బంప్స్ వీడియో లీక్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. గ్రాండ్ సెక్యూరిటీ సిస్టంతో సినిమా షూట్‌ను జరుపుతున్నారు టీం. అంతేకాదు.. మేకర్స్ ఈ సినిమాతో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్ట‌ర్‌ను ఖాతాలో వేసుకోబోతున్నాడని.. పాన్ వరల్డ్ రేంజ్‌లో దర్శకులకు ఈ సినిమాతో పోటీ ఇవ్వడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ అవతార్ లెవెల్‌కి ఏ మాత్రం తీసుకోకుండా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడట. అంతేకాదు సినిమా కోసం అదే రేంజ్‌లో కష్టపడుతున్నారు.

SSMB29: Mahesh Babu's pre-look out; big reveal in November

కాగా.. నిన్న మహేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన ఏదో ఒక బిగ్ అప్డేట్ ఇస్తాడని అభిమానులంతా ఎంతగానో ఆశపడినా.. క‌నీసం గ్లింప్స్‌ వస్తుందని భావించినా.. కనీసం మహేష్ ఫేస్ రివిల్ చేయకుండా ఓ సింపుల్ ప్రోమో లుక్ తో సరిపెట్టాడు రాజమౌళి. అయితే ఫ్యాన్స్ మాత్రం దీనిపై నిరాశ వ్యక్తం చేశారు. అస్సలు రాజమౌళి అప్డేట్ ఇవ్వకపోతే మా హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేమే రివీల్‌ చేస్తాం. ఎలాగైనా సినిమాను హైలైట్ చేస్తామంటూ పూనుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్క ఏఐ జనరేటెడ్‌ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసి అదిరిపోయే క్వాలిటీ స్టాండర్డ్స్‌తో దానిని రిలీజ్ చేసి తెగ సంద‌డి చేస్తున్నారు. క్రియేటివిటీ ని ఉపయోగించి వీడియోను డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. చాలామంది ఆడియన్స్ సైతం ఇది నిజమైన గ్లింప్స్ అని నమ్మేస్తున్నారు. ఈ వీడియోలో క్వాలిటీ చూస్తే అసలు ఎడిటింగ్ వీడియోల అనిపించడం లేదు. ఇక.. ఈ వీడియో మేకర్స్ వరకు చేరితే కచ్చితంగా దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చాలామంది అభిమానులు సైతం రాజమౌళి వరకు ఈ వీడియో రిలీజ్ కావాలంటూ షేర్లు మీద షేర్లు చేస్తున్నారు. తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక.. ఈ సినిమాల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు కీలకపాత్రలో మెరువనున్న సంగతి తెలిసిందే. విలన్స్ గా ప్రియాంక, పృథ్వీరాజ్ నటిస్తున్నారని.. మాధవన్ మహేష్ తండ్రి రోల్ లో మరువనున్నాడని సమాచారం. ఇక ఏడది నవంబర్‌లో సినిమాకు సంబంధించిన కనీన‌వినీ ఎరగని అప్డేట్స్‌ను నవంబర్‌లోనే రిలీజ్ చేస్తామని రాజమౌళి అఫీషియల్‌గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులంతా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.