అలనాటి మహానటి సావిత్రికి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఎంత వేగంగా అయితే ఎదిగిందో.. అంతే త్వరగా పతనమైపోయింది. ఆమె లైఫ్ విషాదం అయిపోయింది. సావిత్రి జీవితం, సినీ కెరీర్ చాలామందికి గొప్ప పాఠం. కాగా.. ఇలాంటి క్రమంలోనే జెమినీ గణేషన్ పెద్ద కూతురు కమల సెల్వరాజ్ సావిత్రి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లుగా మారుతున్నాయి. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జెమినీ గణేషన్‌కు అప్పటికే పెళ్లయింది అని తెలిసినా.. నాన్నను ప్రేమించి రెండో పెళ్లి చేస్తుందని.. ఆయని బ్లాక్ మెయిల్ చేసిందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ రోజు కుండపోత వర్షంలో సావిత్రి మా ఇంటికి వచ్చిందని.. ఆమె చెడిపోకూడదని ఆమెకు తాళికట్టి గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు నాన్న.. ఆమెకు తమిళ్ రాదు. సంతకం పెట్టడం నేర్పించి.. కారు నడపడం నేర్పించి.. గౌరవంగా బతకడం నేర్పించిన ఆయనను.. పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసిన ప్రేమించింది. బ్లాక్ మెయిల్ చేసి 15 ఏళ్లు మా ఇంటికి రానివ్వకుండా తన దగ్గరే ఉంచేసుకుంది. మా కుటుంబాన్ని తానే సర్వనాశనం చేసిందంటూ ఆరోపించింది. ఇక నాన్నతో పని చేసిన ప్రతి హీరోయిన్ ఆమెను ప్రేమించిందని.. చాలామంది ఆయన్ని ప్రేమించారు కానీ.. అందరికీ ఆయన లైఫ్ ఇవ్వలేదు. చివరి వరకు నాన్న అమ్మను ప్రేమించారు. ఆమె మీద ప్రేమ ఎప్పుడూ తగ్గిపోలేదంటూ కామెంట్స్ చేసింది.
రోడ్డుపై ఆడుకొని అమ్మ దగ్గరికి వచ్చే పిల్లాడిలాని నాన్న మనస్తత్వం ఉంటుందని. ఆయన కూడా ఒక పిల్లాడే. ఆయన లాంటి మంచి నాన్న ఎవ్వరికీ ఉండరంటూ పిల్లలను చాలా బాగా పెంచారని చెప్పుకొచ్చింది. ఇక సావిత్రి పిల్లల్ని కూడా బాగా చూసుకునే వాళ్ళు అంటూ చెప్పుకోచ్చిన కమలా.. సావిత్రి తెలుగులో ఫేమస్ హీరోయిన్. ఆమె లైఫ్ తాగుడుకు బానిసవ్వడం వలన నాశనం అయిందని అంగీకరించలేకపోయారు.. నాన్న పై నిందలు వేశారు.. అసలు వాస్తవం ఎవరికీ తెలియదు. మహానటి సినిమా వచ్చినప్పుడు నాన్నని హంతకుడిగా పోస్టర్లు వేయించారు. నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటి తప్పులు చేసినందుకే ఆమెకు చివరికి తగ్గ శిక్ష పడిందని.. సావిత్రి గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.