బోయపాటి పై సందీప్ రెడ్డివంగా పంచ్ డైలాగ్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. దర్శకులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది.. స్టార్ట్ డైరెక్టర్లుగా తమను తాము ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. దీనికోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ల‌లో డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ఒక‌రు. తన మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బోయ‌పాటి.. ఆ సినిమా నుంచి వరుసగా మాస్ సినిమాలు చేస్తూ.. మాస్‌ సినిమాలకు క్యారాఫ్ అడ్రెస్‌గా మారిపోయాడు. సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో బాలయ్యకు తిరుగులేని మార్క్‌ క్రియేట్ చేసి పెట్టిన బోయ‌పాటి.. ప్రస్తుతం మ‌రోసారి బాలకృష్ణతోనే అఖండ 2 సినిమాను రూపొందిస్తున్నాడు.

Boyapati Srinu Bags Rs 40 Crore for Akhanda 2

ఇక బోయపాటి సినిమాలన్నీ ఒకే టెంప్లేట్ పై నడుస్తాయని.. మాస్ ఆడియన్స్ కు మాత్రమే ఇది నచ్చుతాయి అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇక‌.. ఆయన సినిమాల్లో ఫైట్లు నెక్స్ట్ లెవెల్ లో హైలెట్ అవుతుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బోయపాటిపై పంచ్ డైలాగ్ వేసిన‌ట్లు సందీప్ రెడ్డి వంగ కామెంట్స్ చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రీసెంట్ గా బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాప‌బుల్‌షోకు సందీప్ రెడ్డి వంగ స్పెషల్ గెస్ట్‌గా హాజ‌రై సంద‌డి చేశాడు.

Sandeep Reddy Vanga Exposes Bollywood's Dark Secret: 'They're Biased  Against My Actors | Glamsham.com | Since 1999

ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ.. బోయపాటి గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని సందీప్‌ను ప్రశ్నించగా.. బోయపాటి సినిమాలు చాలా బాగుంటాయి. కానీ.. అన్ని సినిమా ఫైట్లు టెంపుల్‌లోనే ఉంటాయంటూ ఫ‌నీ కామెంట్ చేశాడు. సందీప్ రెడ్డివంగా చెప్పింది నిజమే అయినా.. ఎలాంటి కామెడీ పంచ్ వేయకపోయినా.. బోయపాటి ఫ్యాన్స్ మాత్రం.. కావాలనే బోయపాటిని కామెడీ చేయడానికి అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశాడని.. ఆయనపై పంచ్ డైలాగ్ వేశాడు అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. సందీప్ చెప్పిన దానిలో తప్పేముంది బోయపాటి.. అన్ని సినిమా ఫైట్లు టెంపుల్ లోనే కదా డిజైన్ చేస్తున్నాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా స‌రే.. మాస్ డైరెక్టర్గా బోయపాటి.. అఖండ 2తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని.. పాన్ ఇండియా లెవెల్‌లో తనని తాను ప్రూవ్ చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.